NTV Telugu Site icon

Shami Plant In Home: తులసి మొక్కతోపాటు జమ్మి మొక్కను ఇంట్లో నాటితే ఎన్ని ప్రయోజనాలేంటంటే

Shami Tree

Shami Tree

Shami Plant In Home: తులసి మొక్కను హిందూ మతంలో పూజిస్తారు. అంతేకాకుండా ఇళ్లలో కూడా ఎంతో పవిత్రంగా తులసిని పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం, తులసి మాత్రమే కాదు.. రావి, అరటి, శమీ లేదా జమ్మి చెట్లను కూడా పూజిస్తారు. ఇకపోతే.. రావి, అరటి చెట్లు గురువును సూచిస్తున్నట్లే.. శమీ మొక్క శని గ్రహాన్ని సూచిస్తుంది. ఇంట్లో శమీ మొక్కను నాటితే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుందని చెబుతారు. ఇది కాకుండా, జమ్మి మొక్క అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మరి శమీ చెట్టు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి చూస్తే..

Read Also: IND vs SA T20: భారత్‌తో టి20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

శాస్త్రాల ప్రకారం జమ్మి శని కారకునిగా భావించి ఇంట్లో మొక్కుకుంటే చాలా శ్రేయస్కరం. తులసి మాదిరి శమీ మొక్కను పూజించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. శమీ మొక్కను ఇంట్లో నాటడం వల్ల శనిగ్రహ పరిస్థితి శాంతిస్తుందని, అందుకే శనివారం శమీ మొక్క దగ్గర తప్పనిసరిగా నెయ్యి దీపం వెలిగించాలని నమ్ముతారు. శని మొక్క శని వాస్తవ రూపంగా పరిగణించబడుతుంది. ఏ ఇంట్లోనైనా కలహాలు, గొడవలు, అశాంతి వాతావరణం ఉంటే శమీ మొక్కను తప్పనిసరిగా పూజించాలి.

Read Also: BPL: బీపీఎల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు నంబియార్ కన్నుమూత

బుధవారం నాడు వినాయకుడికి శమీ ఆకులను నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతారు. దీంతో ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇది ఇంట్లో సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ప్రదోష కాలంలో శమీ మొక్కను పూజించాలని చెబుతారు. అలాగే దానికి నీరు సమర్పించిన తర్వాత నెయ్యి దీపం వెలిగించాలి. ఇది కుటుంబంలో ఆనందం, శాంతి ఇంకా శ్రేయస్సును తెస్తుంది.

Show comments