Site icon NTV Telugu

Mohammed Shami: కేఎల్ రాహుల్‌పై ఈ రకమైన ప్రవర్తన తగదు.. సంజీవ్ గోయెంకాపై షమీ కీలక వ్యాఖ్యలు

Shami

Shami

కేఎల్ రాహుల్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినందుకు సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మండిపడ్డారు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓటమి తర్వాత ఆవేశానికి లోనైన జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా.. కెమెరా ముందే మాట్లాడటం సరైంది కాదనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. సోషల్‌ మీడియాలోనూ గోయెంకా తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు షమీ మద్దతుగా నిలిచాడు.

Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసిన ఢిల్లీ కోర్టు..

ఈ సందర్భంగా.. ఓ క్రీడా ఛానల్‌తో షమీ మాట్లాడుతూ.. మీరు ఓనర్. ఎంతో మర్యాదస్తులు. అదే సమయంలో ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలి. చాలామంది మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇలాంటి వాటిని మైదానంలో కెమెరా ముందు కాకుండా.. డ్రెస్సింగ్‌ రూమ్‌ లేదా సమావేశాల్లో మాట్లాడి ఉంటే బాగుండేది. ఇది చాలా అవమానకరం. ఈ రకమైన ప్రవర్తన తగదు.. ఈ సందేశం చాలా తప్పుగా ఉంది. ఎందుకంటే అతడు ఒక కెప్టెన్. సాధారణ ప్లేయర్‌ కూడా కాదు. క్రికెట్‌ అంటేనే టీమ్‌ గేమ్. ప్రణాళికలు ఒక్కోసారి సక్సెస్ కావు. మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ప్రతి ఆటగాడికి గౌరవం ఇవ్వాలి. మాట్లాడేందుకు ఓ విధానం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుంది’’ అని షమీ వ్యాఖ్యానించాడు.

Pallavi Prasanth : అమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రైతు బిడ్డ.. ధర ఎంతో తెలుసా?

కాగా.. కీలక మ్యాచ్లో సన్‌రైజర్స్‌ చేతిలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విజృంభించడంతో 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఫినిష్ చేసింది. ఫలితంగా లక్నో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై అందరి ముందే సీరియస్‌ అయిన వీడియో ఒకటి వైరల్ అయింది.

Exit mobile version