Site icon NTV Telugu

Shalini : అజిత్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షాలిని.. భర్తంటే ఎంత ప్రేమో ..

Ajith Kumar Baby Shalini

Ajith Kumar Baby Shalini

తమిళ స్టార్ హీరోలలో అజిత్ కూడా ఒకరు .. తెలుగులో కూడా ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి. దాంతో ఆయనకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. నేను ఆయన 53 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు , అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు..

ఈ సందర్భంగా అజిత్ భార్య షాలిని భర్తకు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చింది.. అజిత్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసిన షాలిని ఆయనకి డుకాటీ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అజిత్ ప్రొఫిషనల్‌ రేసర్ అన్న విషయం తెలిసిందే.ఇప్పుడు షాలిని కూడా ఆయనకు ఇష్టమైన బైకు నే ఇచ్చింది.. ఇందుకు సంబందించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

అజిత్ సినిమాల విషయానికొస్తే.. విడా ముయార్చితో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమా కూడా అజిత్ చేతిలో ఉంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేయబోతున్నారు.. ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. వీటితో పాటుగా పలు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..

Exit mobile version