Shakib Al Hasan slaps Fan: ఇన్నాళ్లు మైదానంలో అదరగొట్టిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఇకనుంచి ప్రజాజీవితంలో కూడా భాగం కానున్నాడు. షకీబ్ ఎంపీగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఆదివారం జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మగుర 1 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షకీబ్.. భారీ మెజార్టీతో గెలుపొందాడు. అవామీ లీగ్ తరఫున పోటీ చేసిన బంగ్లా కెప్టెన్.. ఏకంగా లక్షా యాభై వేల మెజార్టీతో గెలిచాడు. షకీబ్ సమీప ప్రత్యర్థి ఖాజీ రేజౌల్ హసన్‌కు కేవలం 45,933 ఓట్లు మాత్రమే పడ్డాయి.
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. పోలింగ్ స్టేషన్ వద్ద షకీబ్‌ను ఓ అభిమాని వెనక నుంచి నెట్టాడు. దాంతో సహనం కోల్పోయిన బంగ్లా కెప్టెన్.. అభిమాని చెంపపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షకీబ్ ఓటు వేయడానికి వచ్చిన పోలింగ్ స్టేషన్ వద్ద ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: Vijay-Rashmika: ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్?
రెండు రోజుల క్రితం అభిమానులు సెల్ఫీల కోసం షకీబ్ అల్ హసన్ వద్దకు వెళ్లగా.. ఆ సమయంలో అతడు నిరాశగా కనిపించాడు. ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ అన్న తేడా లేకుండా షకీబ్ తరుచూ గొడవలకు దిగుతాడు. ఇటీవల మైదానంలో అంపైర్‌తో గొడవకు కూడా దిగాడు. బంగ్లా ఎన్నికల్లో గెలిచిన రెండో కెప్టెన్‌గా షకీబ్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ముష్రఫే ముర్తాజా ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.
Shakib Al Hasan slapped a fan..!pic.twitter.com/KaUbabgkCX
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024