Shakib Al Hasan: సొంత దేశం పొమ్మంది.. పొరుగు దేశంలో అదరగొడుతున్న సీనియర్ ప్లేయర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakib Al Hasan: బంగ్లాదేశ్ సీనియర్ అల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గ్లోబల్ సూపర్ లీగ్ లో అదరగొట్టాడు. ఆడిన మొదటి మ్యాచులోనే అటు బ్యాటుతోనూ ఇటు బాల్ తోనూ మంచి ప్రదర్శన చేసి తన జట్టును గెలిపించాడు. ఇక ఈ 38 ఏళ్ల ఆల్ రౌండర్ బంగ్లాదేశ్ జట్టు నుండి నిషేధం ఎదుర్కొంటున్నాడు. దీంతో అన్నీ ఫార్మాట్ల నుండి షకీబ్ ను తప్పించారు. ఇది ఇలా ఉండగా..
Read Also:Virat Kohli: ఏంటి.. కోహ్లీ మరో టీ20 లీగ్ లో ఆడబోతున్నాడా..? నిజమెంత..?
Also Read
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
షకీబ్ అల్ హాసన్, ప్రస్తుతం వెస్టిండీస్ లో జరుగుతున్న గ్లోబల్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నాడు. అతను దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచులోనే మంచి ప్రదర్శనతో అదరగొట్టాడు. మొదటి బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో షకీబ్ అర్ద సెంచరీతో మెరిసి ఆ జట్టు మంచి స్కోరుకు కారణమయ్యాడు. ఇక ఛేదనలో సెంట్రల్ జట్టును తన బౌలింగ్ తో భయపెట్టాడు. తాను వేసిన 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Read Also:Pawan Kalyan: హిందీని ప్రేమిద్దాం.. మన దిగా భావిద్దాం.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాగా, షకీబ్ ఈ లీగ్ లో బంగ్లాదేశ్ జట్టు అయిన రంగపూర్ రైడర్స్ కు ఆడాలి. కానీ, షకీబ్ పై నిషేధం ఉండటంతో అతను ఏ విధంగానూ బంగ్లాదేశ్ కు సంబంధించిన జట్లలో ఆడకూడదు. అందువల్ల షకీబ్ దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఇదిలా ఉండగా.. షకీబ్ గత ఏడాది నుండి బంగ్లాదేశ్ క్రికెట్ కు దూరమయ్యాడు. అతడి పై వచ్చిన ఆరోపణల కారణంగా బంగ్లా క్రికెట్ బోర్డు అతడిపై బ్యాన్ విధించింది. ఈ బ్యాన్ పూర్తి అయ్యేవరకు అతడు వారి దేశం తరుపున క్రికెట్ ఆడలేడు.
తాజావార్తలు
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!