Site icon NTV Telugu

Shakib Al Hasan: సొంత దేశం పొమ్మంది.. పొరుగు దేశంలో అదరగొడుతున్న సీనియర్ ప్లేయర్..!

Shakib Al Hasan

Shakib Al Hasan

Shakib Al Hasan: బంగ్లాదేశ్ సీనియర్ అల్ రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్‌ గ్లోబల్ సూపర్ లీగ్ లో అదరగొట్టాడు. ఆడిన మొదటి మ్యాచులోనే అటు బ్యాటుతోనూ ఇటు బాల్ తోనూ మంచి ప్రదర్శన చేసి తన జట్టును గెలిపించాడు. ఇక ఈ 38 ఏళ్ల ఆల్ రౌండర్ బంగ్లాదేశ్ జట్టు నుండి నిషేధం ఎదుర్కొంటున్నాడు. దీంతో అన్నీ ఫార్మాట్ల నుండి షకీబ్ ను తప్పించారు. ఇది ఇలా ఉండగా..

Read Also:Virat Kohli: ఏంటి.. కోహ్లీ మరో టీ20 లీగ్ లో ఆడబోతున్నాడా..? నిజమెంత..?

షకీబ్ అల్ హాసన్, ప్రస్తుతం వెస్టిండీస్ లో జరుగుతున్న గ్లోబల్ సూపర్ లీగ్లో ఆడుతున్నాడు. అతను దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచులోనే మంచి ప్రదర్శనతో అదరగొట్టాడు. మొదటి బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో షకీబ్ అర్ద సెంచరీతో మెరిసి ఆ జట్టు మంచి స్కోరుకు కారణమయ్యాడు. ఇక ఛేదనలో సెంట్రల్ జట్టును తన బౌలింగ్ తో భయపెట్టాడు. తాను వేసిన 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read Also:Pawan Kalyan: హిందీని ప్రేమిద్దాం.. మన దిగా భావిద్దాం.. పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాగా, షకీబ్ ఈ లీగ్ లో బంగ్లాదేశ్ జట్టు అయిన రంగపూర్ రైడర్స్ కు ఆడాలి. కానీ, షకీబ్ పై నిషేధం ఉండటంతో అతను ఏ విధంగానూ బంగ్లాదేశ్ కు సంబంధించిన జట్లలో ఆడకూడదు. అందువల్ల షకీబ్ దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఇదిలా ఉండగా.. షకీబ్ గత ఏడాది నుండి బంగ్లాదేశ్ క్రికెట్ కు దూరమయ్యాడు. అతడి పై వచ్చిన ఆరోపణల కారణంగా బంగ్లా క్రికెట్ బోర్డు అతడిపై బ్యాన్ విధించింది. ఈ బ్యాన్ పూర్తి అయ్యేవరకు అతడు వారి దేశం తరుపున క్రికెట్ ఆడలేడు.

Exit mobile version