NTV Telugu Site icon

Shahid Kapoor : దక్షిణాది సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన షాహిద్ కపూర్…!!

Shahid Kapoor Net Worth 2023 Salary Car Wife Business

Shahid Kapoor Net Worth 2023 Salary Car Wife Business

బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇండియన్ సినిమా అని ఒకప్పుడు అందరూ చెప్పుకునేవారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కన్నా దక్షిణాది సినిమాలు చాలా అద్భుతంగా ఉండడంతో దక్షిణాది సినిమాలకు మంచి క్రేజ్ కూడా పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు తెలుగు సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ అయితే తెలుగు సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి ని చూపుతున్నారు.

ఈ క్రమంలోనే మరొక నటుడు కూడా తనకు తెలుగు తమిళ భాషలలో అవకాశాలు వస్తే నటించాలని ఉంది అంటూ దక్షిణాది సినిమాలపై తనకు ఉన్నటువంటి ఆసక్తి మనసులో మాటను బయటపెట్టారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న షాహిద్ కపూర్ తాజాగా బ్లడీ డాడీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు.డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ సినిమా 2011లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ స్లీప్ లెస్ నైట్ చిత్రానికి అడాప్షన్ గా తెరకెక్కుతుందని సమాచారం.. ప్రముఖ ఓటీటీ జియో సినిమాలో ఈ చిత్రం జూన్ 9వ తేదీ విడుదల కాబోతుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా షాహిద్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారని తెలుస్తుంది..ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనని యాంకర్ ప్రశ్నిస్తూ మీకు కనుక హాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వస్తే నటిస్తారా అంటూ ఆయనను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు షాహిద్ కపూర్ సమాధానం చెబుతూ తాను హాలీవుడ్ సినిమా అవకాశాలు వస్తే ఏ మాత్రం కూడా నటించనని తెలిపారు. హాలీవుడ్ సినిమాలలో మనకు ప్రాధాన్యత లేని పాత్రలలో అవకాశాలను ఇస్తారు. అందుకే తాను హాలీవుడ్ సినిమాల కన్నా దక్షిణాది ఇండస్ట్రీలో ని తెలుగు తమిళ భాషలలో అవకాశాలు వస్తే కచ్చితంగా నటిస్తానని ఈ భాషా చిత్రాలలో ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉండడంతో తనని తాను నటుడిగా నిరూపించుకోడానికి ఈ సినిమాలు చాలా ఉపయోగపడతాయి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.