Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మైలురాయిని ఎట్టకేలకు సాధించారు. తన “జవాన్” చిత్రానికిగాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఇది షారుఖ్ ఖాన్ తన 33 ఏళ్ల కెరీర్‌లో పొందిన మొదటి జాతీయ అవార్డు. ఇది అతడి సినీ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సేలు ఈ అవార్డు అందుకున్నారు. ఇద్దరు నటులు వెండి కమలం, సర్టిఫికెట్‌తో పాటు ఒక్కొక్కరు రూ.1 లక్ష నగదు బహుమతి అందుకున్నారు.
READ MORE: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ ‘‘దేశద్రోహి’’.. గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా సంచలన వ్యాఖ్యలు..
అయితే.. షారుఖ్ ఖాన్ కు, ఈ అవార్డు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు. అతని కెరీర్ లో ఒక గేల్డెన్ మైలురాయి. మూడు దశాబ్దాలకుపైగా బాలీవుడ్‌ను ఏలిన షారుఖ్ ఇప్పుడు దేశ అత్యున్నత చలనచిత్ర గౌరవాన్ని అందుకున్నాడు. షారుఖ్ ఖాన్ తో పాటు, రాణి ముఖర్జీ, విక్రాంత్ మాస్సేలను కూడా వెండి కమలంతో సత్కరించారు. ఇదిలా ఉండగా.. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం “కింగ్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తన ప్రతిష్టాత్మక ఉత్తమ నటుడి అవార్డును స్వయంగా అందుకోవడానికి తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టాడు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనే, సుహానా ఖాన్‌లతో కలిసి షారుఖ్ కనిపించనున్నారు.
