Shah Rukh Khan Home in US: భారతదేశంలోని అత్యంత సంపన్న యాక్టర్‌లలో బాలీవుడ్ ‘బాద్‌షా’ షారుఖ్ ఖాన్ ఒకరు. షారుఖ్ ఆస్తుల విలువ రూ.6300 కోట్లు అని ఇటీవల ఫోర్బ్స్ పేర్కొంది. అంతేకాదు అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోల జాబితాల్లో కూడా బాద్‌షానే టాప్. సినిమా, యాడ్స్, వ్యాపారాల ద్వారా షారుఖ్ బాగానే సంపాదిస్తున్నారు. ముంబైలో షారుక్ నివాసం ‘మన్నత్’ విలువ 200 మిలియన్లకు పైనే. ముంబైలో మాత్రమే కాదు విదేశాలలో కూడా బాద్‌షాకు ఇల్లులు ఉన్నాయని కొద్ది మందికి మాత్రమే తెలుసు.
షారుఖ్ ఖాన్‌కు లండన్, దుబాయ్‌లతో పాటు అమెరికాలో విలాసవంతమైన ఇల్లులు ఉన్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో ఉన్న మాన్షన్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ ఇంటిలో ఆరు విశాలమైన బెడ్‌రూమ్‌లు, పూల్, ప్రైవేట్ కాబానాస్, ప్రైవేట్ టెన్నిస్ కోర్ట్‌లు ఉంటాయి. ఈ ఇల్లు తెలుపు మరియు లేత గోధుమరంగులో చాలా అందంగా ఉంటుంది. ఇది అద్దాలు మరియు షాన్డిలియర్‌తో అలంకరించబడింది. శాంటా మోనికా, రోడియో డ్రైవ్, వెస్ట్ హాలీవుడ్‌లకు ఈ మాన్షన్ కూతవేటు దూరంలో ఉంటుంది. ఈ మాన్షన్ చూస్తే.. కళ్ళు జిగేల్ మంటాయి.
Also Read: IND vs AFG: ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: రషీద్ ఖాన్
షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు ప్రతి ఏడాది కాలిఫోర్నియాలోని మాన్షన్‌కు వెళుతుంటారు. ఇక్కడ సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, అబ్రమ్ ఖాన్‌లకు ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. ఈ మాన్షన్ ఓ లగ్జరీ రిసార్ట్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఇక్కడ చుట్టూ పచ్చదనం మధ్యలో ఈ భవనం ఉంటుంది. ఈ బంగ్లా ప్రజలకు అద్దెకు కూడా లభిస్తుంది. దీని ఒక రాత్రి అద్దె దాదాపుగా రెండు లక్షల రూపాయలు అట.