Site icon NTV Telugu

Shadnagar: ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

New Project (29)

New Project (29)

షాద్ నగర్ లోని ఆల్విన్‌ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని 2 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. కంపెనీలో దాదాపు 50 మంది కార్మికులు చిక్కుకోగా.. వారిని బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న కార్మికులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు.

READ MORE: Guinness World Record: ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. విశేషాలేంటంటే..

రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. కార్మికులను బయటకు రప్పిస్తున్నారు. ద్వారాలు మూసుకుపోవడంతో కార్మికులను నిచ్చెన ద్వారా కంపెనీ నుంచి బయటకు వస్తున్నారు. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అనేదానిపై అధికారుల ఆరా తీస్తున్నారు. మంటల వేడి తాళలేక నలుగురు కార్మికులు పైనుంచి కిందకి దూకారు. దీంతో వారికి గాయాలయ్యాయి. సిబ్బంది ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకుంటున్నారు. షాద్నగర్ అగ్ని మాపక సిబ్బంది నిచ్చెనలతో కార్మికులకు సహాయమందిస్తున్నారు. ఆల్విన్ పరిశ్రమ అగ్ని ప్రమాదంలో కార్మికులు, ఉద్యోగులు అంతా సేఫ్ గా బయట పడ్డారు. దట్టమైన పొగల్లో చిక్కుకున్న ఐదుగురిలో ఒక వ్యక్తి భయపడి బిల్డింగ్ పై నుండి దూకడంతో తీవ్ర గాయాలు కాగా అతడిని ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version