Site icon NTV Telugu

కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు వస్తారు.. టీఆర్ఎస్ ఇక తిరుగుబాటే : షబ్బీర్ అలీ

మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు, బీజేపీ నేతలు తమకు టచ్ లో ఉన్నారని… హుజురాబాద్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి భారీగా వలసలు వస్తాయని షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ నుండి వెళ్ళిన ఎమ్మెల్యే లు వెనక్కి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని… అధికార పార్టీ ఎమ్మెల్యే లు కూడా తనకు, పిసిసి చీఫ్ కి టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లు తనకు టచ్ లో ఉన్నారని… అధికార పార్టీ ఎమ్మెల్యే లు జనం తిరుగుబాటు తప్పదన్నారు. తన దృష్టి లో కేటీఆర్ ఓ బచ్చా అని… హుజూరాబాద్ లో మొదట కొంత వెనకబడి ఉన్నా…పుంజుకుంటున్నామని స్పష్టం చేశారు. హుజురాబాద్ లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ.

Exit mobile version