NTV Telugu Site icon

Sexual Harassment: ఛీ.. ఛీ.. కామాంధుడా.. నీ వయసేంటి.? చేసే పనేంటి..?

Viral Video Pervert

Viral Video Pervert

Sexual Harassment did a old man on young lady: ప్రస్తుత రోజుల్లో మహిళలపై ఎలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం నలుమూలల ప్రతిరోజు అనేకమంది మహిళలు అత్యాచారం బారిన పడుతూ అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు మితిమీరిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన అనేక విషయాలు మీడియా ద్వారా మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. ఇకపోతే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బిసౌలిలో ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Shocking Video: ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిపై పడ్డ గేటు.. చివరికి ప్రాణాలు.?

ఇక ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిసోలిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. వైరల్ గా మారిన వీడియోలో నగరంలోని స్థానికంగా ఉన్న దుకాణంలో యువతి ఓ వృద్ధుడి పక్కన నిలబడి ఉంది. ఆ యువతీ ఓవైపు తన వారితో తిరిగి మాట్లాడుతుండగా.. వెనుక వైపు ఉన్న వృద్ధుడు రెచ్చిపోయాడు. అమ్మాయి ఓ వైపు తన వారితో మాట్లాడుతుండగా.. మరోవైపు వృద్ధుడు ఆ అమ్మాయి జుట్టును పలుమార్లు పట్టుకుంటూ జుట్టు వాసనను చూసేందుకు ప్రయత్నం చేశాడు.

Champions Trophy 2025: వామ్మో.. ఛాంపియన్స్ ట్రోఫీకి రూ.584 కోట్ల ఖర్చు..?

మొదటగా వీలు కాకున్న చివరికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి జుట్టును చేత్తో పట్టుకొని వాసన చూడడం వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. అయితే., తాను చేస్తున్న పనిని ఆ వృద్ధుడు ఎవరు గమనించట్లేదని భావించాడు. కాకపోతే ఈ తతంగం మొత్తం దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది. ఇంత జరిగిన ఆ అమ్మాయికి విషయం తెలియకపోవడం విడ్డురం. ఆ వీడియోని దుకాణం సంబంధించిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. ఆ వృద్ధుడి వై మండిపడుతున్నారు. నీ వయసు ఏంటి..? నువ్వు చేసే పనులు ఏంటి..? అంటూ గాటుగా విమర్శిస్తున్నారు. మరికొందరైతే ఇలాంటి కామాంధులను నడిరోడ్డుపై ఉరితీయాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments