NTV Telugu Site icon

China: కలవరపెడుతున్న హైకూయ్ తుపాను.. అనేక రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేత

China

China

China: హైకూయ్ తుపాను మంగళవారం చైనాలోని ఆగ్నేయ తీరం వెంబడి తీరం దాటే అవకాశం ఉన్నందున అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. కొన్ని పాఠశాలలు నిలిపివేయబడ్డాయి. ఈ మేరకు చైనా ఆధారిత గ్లోబల్ టైమ్స్ నివేదించింది. సోమవారం జాతీయ వాతావరణ కేంద్రం (NMC) భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం, ఫుజియాన్ ప్రావిన్స్‌లోని జాంగ్‌పు, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని హుయిలై మధ్య తీర ప్రాంతంలో హైకూయ్ తీరం దాటే అవకాశం ఉంది. . హైకూయ్ ప్రభావంతో గ్వాంగ్‌డాంగ్, ఫుజియాన్, తైవాన్‌తో సహా పలు ప్రాంతాల్లో సోమవారం నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని గ్లోబల్ టైమ్స్ నివేదించింది.

సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు గ్వాంగ్‌డాంగ్ తూర్పు తీరం వెంబడి 30-70 సెంటీమీటర్ల తుఫాను ఉంటుందని వెల్లడించింది. గ్వాంగ్‌డాంగ్ తూర్పు తీరం వెంబడి దక్షిణ చైనా సముద్రం ఈశాన్య భాగంలో 3 నుండి 5 మీటర్ల ఎత్తులో అలలు పోటెత్తుతున్నాయి. మ సౌత్ చైనా సీ ఫోర్‌కాస్టింగ్ అండ్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ప్రకారం, తూర్పు గ్వాంగ్‌డాంగ్ ఆఫ్‌షోర్ నీటిలో 2 నుండి 3.3 మీటర్ల ఎత్తులో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

Also Read: Bengal Minister: గవర్నర్ జేమ్స్‌బాండ్‌ లాగా వ్యవహరిస్తున్నారు .. బెంగాల్ మంత్రి కీలక వ్యాఖ్యలు

సోమవారం మధ్యాహ్నం నుంచి 391 హైస్పీడ్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు చైనా రైల్వే గ్వాంగ్‌డాంగ్ గ్రూప్ తెలిపింది. వీటిలో హాంగ్‌జౌ-షెన్‌జెన్ లైన్‌లో పనిచేసే రైల్వే సేవలు ఉన్నాయి. ఈ రైళ్లు జెజియాంగ్ నుంచి ఫుజియాన్ ద్వారా గ్వాంగ్‌డాంగ్ వరకు, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ అంతటా పనిచేసే మీజౌ-శాంతౌ రైల్వే ద్వారా నడుస్తాయి. హాంగ్‌జౌ-షెన్‌జెన్ లైన్ గుండా మొత్తం 47 ప్యాసింజర్ రైళ్లను సోమవారం నుంచి నిలిపివేసినట్లు చైనా రైల్వే షాంఘై గ్రూప్‌ను ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ నివేదించింది. గ్వాంగ్‌డాంగ్, ఫుజియాన్ మధ్య సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్న చావోజౌ, శాంతౌ నగరాలు సోమవారం నుంచి కిండర్ గార్టెన్, ఎలిమెంటరీ, హైస్కూల్, ట్యూటరింగ విద్యా సంస్థలను నిలిపివేసాయి. తుఫాన్ హెచ్చరికను ఉపసంహరించుకునే వరకు ఆఫ్‌లైన్ తరగతులు పునఃప్రారంభించబడవని స్థానిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత కోసం ఫుజియాన్ ప్రావిన్స్‌లోని జియామెన్ నగరం సోమవారం నుండి మంగళవారం వరకు అన్ని పాఠశాలలను సస్పెండ్ చేసింది.