High Budget Movies : ‘భారీ’వుడ్ సినిమాలు.. ఆతృతగా చూస్తున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Budget Movies : ఒకప్పుడు బాలీవుడ్లో రూ.100కోట్లు లేదా రూ.200కోట్లకు మించి బడ్జెట్ ఉండే సినిమాలు ఒకటి రెండు మాత్రమే. అయితే ఇప్పుడు భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి ఇండస్ట్రీలో చాలామంది పోటీ పడుతున్నారు. రాబోయే కొద్ది నెలల్లో బాలీవుడ్లో 100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలు.. ఒకటి రెండు కాదు చాలా విడుదల కాబోతున్నాయి. ఈ జాబితాలో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, ‘బాహుబలి’ ప్రభాస్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని వారి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రాజెక్ట్ కె
‘ప్రాజెక్ట్ కె’లో అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పదుకొనే, ప్రభాస్ కనిపించబోతున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఇటీవల ఈ సినిమా షూటింగ్లో అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్ల నుండి రూ.1000 కోట్ల వరకు ఉండనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నారు.
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
ఆదిపురుష్
ప్రభాస్, కృతి సనన్ల మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఆదిపురుష్’ చాలా కాలంగా చర్చల్లో ఉంది. వీఎఫ్ఎక్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా ఖరీదైనది. అయితే ఈ సినిమా పోస్టర్ బయటకు వచ్చినప్పటి నుంచి మేకర్స్ కు కష్టాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లు. ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది.
జవాన్
‘పఠాన్’ తర్వాత ఇప్పుడు షారుఖ్ మరో సినిమాలో ధాసు యాక్షన్‌లో కనిపించబోతున్నాడు. సౌత్ సూపర్ స్టార్ నయనతార ‘జవాన్’లో షారుఖ్ సరసన నటించబోతోంది. అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది.
టైగర్ 3
ఒకవైపు షారుక్ ఖాన్ ‘పఠాన్’ తర్వాత ‘జవాన్’తో ఈ ఏడాది రాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంతో అక్కడ సల్మాన్ ఖాన్ కూడా ‘టైగర్ 3’తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.350 కోట్లు అని అంటున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
సలార్
తెలుగులో ప్రభాస్, రాజ్‌కుమార్ సుకుమారన్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సలార్’. రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ చేసిన భారీ బడ్జెట్ సినిమాలేవీ హిట్ కాలేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!