Site icon NTV Telugu

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా

ఐపీఎస్‌ పదవికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్‌ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసిన ప్రవీణ్‌ కుమార్‌… స్వచ్ఛందంగానే పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నాని పేర్కొన్నారు. ఐపీఎస్‌ గా రెండున్నర దశాబ్దాలుగా సర్వీసు అందించానని… పదవి విరమణ తర్వాత ఫూలే, అంబేద్కర్‌ మార్గంలో నడుస్తానని ప్రకటించారు ప్రవీణ్‌ కుమార్‌. పేద ప్రజలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.  తన రాజీనామా పై ఎలాంటి ఒత్తిళ్లు గానీ, ఇతర కారణాలు గానీ లేవని పేర్కొన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. ఇక ముందు దళితుల కోసం పని చేస్తానని తెలిపారు.

Exit mobile version