NTV Telugu Site icon

Smitha Sabharwal: ఆ వార్తలు అవాస్తవం.. ఐఏఎస్‌గానే విధులు నిర్వహిస్తా: స్మితా సభర్వాల్‌

Smitha Sabharwal

Smitha Sabharwal

Smita Sabharwal React on Central Deputation Rumours: మొన్నటివరకు కేసీఆర్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్.. కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కేంద్ర సర్వీస్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నట్లు కూడా టాక్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ నెట్టింట వస్తున్న వార్తలను స్మితా సభర్వాల్‌ ఖండించారు. ఆ వార్తలు అన్ని అవాస్తవమని ఎక్స్ వేదికగా తెలిపారు.

‘నేను సెంట్రల్ డిప్యుటేషన్‌కి వెళ్తున్నానని కొన్ని వార్తా ఛానెల్‌లు ఫేక్ న్యూస్ రిపోర్ట్ చేయడం చూశా. ఆ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారమైనవి. నేను తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిగానే విధులను నిర్వహిస్తా. తెలంగాణ ప్రభుత్వం నాకు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా. నా రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాను’ అని ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Also Read: Mohammed Shami: నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవడు ఆపుతాడు.. మహమ్మద్ షమీ ఫైర్!

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని.. ఆమెను కార్యదర్శిగా మాజీ సీఎం కేసీఆర్ నియమించారు. సీఎంవో కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా కేసీఆర్ అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా ఆమె పర్యవేక్షించారు. సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ.. తెలంగాణ టూరిజం, హ్యాండ్ లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ.. యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్‌గా స్మితా సబర్వాల్ పేరు తెచ్చుకున్నారు.

Show comments