Smitha Sabharwal: ఆ వార్తలు అవాస్తవం.. ఐఏఎస్‌గానే విధులు నిర్వహిస్తా: స్మితా సభర్వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smita Sabharwal React on Central Deputation Rumours: మొన్నటివరకు కేసీఆర్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్.. కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కేంద్ర సర్వీస్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నట్లు కూడా టాక్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ నెట్టింట వస్తున్న వార్తలను స్మితా సభర్వాల్ ఖండించారు. ఆ వార్తలు అన్ని అవాస్తవమని ఎక్స్ వేదికగా తెలిపారు.
‘నేను సెంట్రల్ డిప్యుటేషన్‌కి వెళ్తున్నానని కొన్ని వార్తా ఛానెల్‌లు ఫేక్ న్యూస్ రిపోర్ట్ చేయడం చూశా. ఆ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారమైనవి. నేను తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగానే విధులను నిర్వహిస్తా. తెలంగాణ ప్రభుత్వం నాకు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా. నా రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాను’ అని ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
Also Read: Mohammed Shami: నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవడు ఆపుతాడు.. మహమ్మద్ షమీ ఫైర్!
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని.. ఆమెను కార్యదర్శిగా మాజీ సీఎం కేసీఆర్ నియమించారు. సీఎంవో కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా కేసీఆర్ అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా ఆమె పర్యవేక్షించారు. సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ.. తెలంగాణ టూరిజం, హ్యాండ్ లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ.. యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్‌గా స్మితా సబర్వాల్ పేరు తెచ్చుకున్నారు.
I see some news channels have reported a fake news- that I am going for central deputation, which is widely circulated.
It is totally false and baseless.
As an #IAS officer of Telangana cadre, I will continue to serve and execute whatever responsibility the Government of…— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్‌ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!