NTV Telugu Site icon

Shubman Gill Trolls: శుభ్‌మన్ గిల్‌ సెల్ఫిష్ కెప్టెన్.. టీ20లకు పనికిరాడు!

Shubman Gill

Shubman Gill

Fans brutally Trolled Shubman Gill Captaincy in IND vs ZIM Sere: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జింబాబ్వే‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓపెనర్‌గా కాకుండా.. మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. రెండో టీ20లో ఓపెనర్‌గా ఆడి సెంచరీ చేసిన అభిషేక్.. మూడో టీ20లో డిమోట్ అయి ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి రావడంతో అభిషేక్‌ను కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ఫస్ట్ డౌన్‌లో దింపాడు. మూడో స్థానంలో ఆడిన అభిషేక్ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

Also Read: Security Risk: హై రిస్క్‌లో ఆండ్రాయిడ్‌ యూజర్లు.. ఏం చేయాలంటే?

సెంచరీ చేసిన అభిషేక్ శర్మను ఓపెనర్‌గా కాకుండా.. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ పంపడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. 46 బంతుల్లోనే సెంచరీ చేసిన అభిషేక్‌ను ఓపెనర్‌గా కొనసాగించాల్సిందని ఫాన్స్ మద్దతుగా నిలిచారు. అదేసమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సెల్ఫిష్ కెప్టెన్’ అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అభిషేక్ శర్మ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. గిల్ టీ20లకు పనికిరాడని, టుక్ టుక్ బ్యాటింగ్‌తో టీమ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంటున్నాడని విమర్శిస్తున్నారు.

Show comments