Site icon NTV Telugu

Vishnu Priya: వామ్మో విష్ణుప్రియ ఏంటి ఇలా.. అస్సలు ఆగడం లేదుగా..

Vishnu Priya

Vishnu Priya

విష్ణుప్రియ యాంకర్‌ అందరికి సుపరిచితమే. ఆమె మొఖంలో ముక్కు హైలెట్‌ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరిని పోవే పోరా షోతో విష్ణుప్రియ, సుధీర్‌ అకట్టుకుని మంచి షోగా గురింపు పొందింది. రష్మి, సుధీర్‌ జంట ఒక క్రేజ్‌ అయితే.. విష్ణుప్రియ, సుధీర్‌ కూడా జంటగా పేరు సంపాదించుకున్నారు. కానీ.. యాంకర్లుగా నటించిన వీరు సినిమాల్లో నటిస్తూ.. వారి సత్తాచాటుకుంటున్నారు. బుల్లితెరపై కనిపించి ప్రేక్షకుల్ని నవ్వించడమే కాకుండా.. సినిమాల్లో కూడా నట్టిస్తూ ముందకు సాగుతున్నారు. అలాంటి వారిలో అనసూయ, సుధీర్‌, ఆది, పలువురు. ఇప్పుడు తాజాగా విష్ణుప్రియ ఎంటర్‌ అయ్యింది. తన అందంతో ఇన్‌స్టాలో ప్రతి ఒక్కరిని తనవైపు తిప్పుకునే విష్ణప్రియ ఇప్పుడు ఓ సాంగ్‌ లో నటించి తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.

బిగ్‌ బాస్‌ షో కంటెస్టెంట్‌ మానస్ తో కలిసి యాంకర్ విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులేసి.. తన అందాలను ఆరబోస్తూ దుమ్మురేపేలా చిందులేసింది. జరీ జరీ పంచెకట్టి.. అంటూ ఊర మాస్ సాంగ్ లో మానస్ తో కలిసి కుర్రకారు మతులు పోగొట్టి.. మాస్ మెచ్చే బీట్ తో అందిరినీ ఆకట్టుకుంటుంది. ఈపాటను ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్ తేజ రాసిన శ్రావణ భార్గవి, సాకేత్, స్ఫూర్తి అద్భుంగా పాడారు. దానికి తగినట్లుగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. దీంతో.. అదిరిపోయే సెట్ లో అదుర్స్ అనిపించేలా ఇద్దరూ స్టెప్స్ వేశారు. ఈసాంగ్‌లో విష్ణు ప్రియను చాలా కొత్తగా కనిపించి గ్లామర్‌ తో ఆకట్టుకుంది. ఇక శేఖర్‌ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన స్టెప్పుల్లో విష్ణు ప్రియ ఇరగదీసింది.

ఈసాంగ్‌లో విష్ణు ప్రియ, మానస్ అదరగొట్టేశారు. తాజాగా ఈపాట సోషల్ మీడియాలో ధూంధాం చేస్తుంది. కాగా.. ఇప్పటి వరకు పలు ఈవెంట్లలో మంచి స్టెప్పులు వేసిన విష్ణుప్రియ తొలిసారి తనలోని టాలెంట్ అంతా బయటకు తీసింది. ఇక మానస్ తో కలిసి సూపర్ డూపర్ డ్యాన్స్ చేసి వారెవ్వా అనిపించిన ఈ వీడియో లక్షల్లో వ్యూస్ అందుకుంది. ఈ సినిమా పాటకు మించి ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో విష్ణు ప్రియ హాట్ హాట్ ఫోటోలను చూసిన నెటిజన్లు.. ఇప్పుడు ఆమె డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. అంతేకాదు విష్ణు ప్రియ ఇంత మంచి డ్యాన్సరా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Vishnu Priya: వామ్మో విష్ణుప్రియ ఏంటి ఇలా.. అస్సలు ఆగడం లేదుగా..

Exit mobile version