Seema Haider: 11 నెలల క్రితం ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన సీమా హైదర్.. ఆరోసారి తల్లైంది..

  • సీమా హైదర్ ఆరోసారి తల్లైంది
  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది
  • సీమా 11 నెలల క్రితం ఒక కుమార్తెకు జన్మనిచ్చింది
Seema Haider

Seema Haider

పాకిస్తాన్ నుండి భారత్ కి వలస వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆరవ బిడ్డకు తల్లి అయ్యింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, సీమ తన భర్త సచిన్ మీనాతో కలిసి రబుపురలోని ఇంటికి చేరుకున్నారు. కొడుకు పుట్టడంతో కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. సీమా 2023 నుండి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో సచిన్ మీనాతో నివసిస్తోంది. సీమా 11 నెలల క్రితం ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు పాకిస్తానీ భర్త గులాం హైదర్ ద్వారా నలుగురు పిల్లలు ఉన్నారు. సచిన్ మీనాతో ఇది ఆమెకు రెండవ సంతానం.

Also Read:Mohan Babu: మోహన్‌బాబు క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు..

సీమా, గులాం హైదర్ 2014లో వివాహం చేసుకున్నారు. 2019లో, గులాం హైదర్ తన భార్య సీమా, వారి పిల్లలను కరాచీలో వదిలి దుబాయ్ వెళ్లారు. ఈ సమయంలో, సీమా PUBG ఆడుతున్నప్పుడు నోయిడాకు చెందిన సచిన్ మీనాతో ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత తన పిల్లలను తీసుకుని సచిన్ తో కలిసి జీవించేందుకు భారత్ కు వచ్చింది. జూలై 3, 2023న, పోలీసులు సీమా, సచిన్‌లను హర్యానాలోని బల్లభ్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్నారు. తరువాత కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. సీమా భారత పౌరసత్వం కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.