NTV Telugu Site icon

UK: టీవీ యాంకర్ హత్యాచారానికి కుట్ర.. ప్లాన్ బెడిసికొట్టి చివరికిలా..!

Rv Anchot

Rv Anchot

కళ్లున్నవి ఆస్వాదించడానికే.. అంతే తప్ప కోరిందల్లా అనుభవించడానికి కాదు. అందుకే నేత్రాలను అదుపులో ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. లేదంటే లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోవల్సి వస్తుంది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.

హోలీ విల్లోబీ.. ఒక లేడీ టీవీ యాంకర్. యూకేలో ఓ టీవీ ఛానల్‌లో ప్రెజెంటర్‌గా పని చేస్తోంది. అయితే ఓ షాపింగ్ సెంటర్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ప్లంబ్‌ అనే వ్యక్తి.. ఆమెపై మక్కువ పెంచుకున్నాడు. ఆమెను శారీరకంగా అనుభవించాలని ప్లాన్ చేసుకున్నాడు. అత్యాచారం చేశాక.. చంపేయాలని కూడా ప్రణాళిక రచించాడు. ఇందుకోసం రెండేళ్ల నుంచి సిద్ధమవుతున్నాడు. ఆమెను ఇంట్లో నుంచి ముందుగా కిడ్నాప్ చేసి.. అనంతరం పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి హత్యాచారం చేయాలని ప్లాన్ గీసుకున్నాడు. ఇందుకోసం క్లోరో‌ఫామ్, కత్తి, మెటల్ కేబుల్ వైర్ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ పాపం పండి.. అతడి కుట్రను ఒక రహస్య పోలీస్ కనిపెట్టేశాడు. దీంతో సెక్యూరిటీ గార్డును చాకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ కేసును బ్రిటీష్ కోర్ట్ విచారిస్తోంది. నిందితుడు 2021-2023 మధ్య కుట్ర పన్నినట్లు రహస్య పోలీస్ అధికారి మార్క్ కోర్టుకు తెలియజేశాడు. కుట్రకు సంబంధించిన వస్తువులను వీడియో ద్వారా న్యాయస్థానానికి వెల్లడిపరిచాడు. ఇక నిందితుడి ఫోన్‌లో టీవీ యాంకర్‌కు చెందిన వెయ్యి ఫొటోలు కనిపించాయి. అశ్లీల చిత్రాలు కూడా ప్రత్యక్షమయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ఆమె కదలికలను ఎప్పటి కప్పుడు గమనిస్తూ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఆన్‌లైన్‌లో ఆమెను పొందడం చాలా కాలంగా ఉన్న అంతిమ కోరిక అని.. తనకు అసలు విషయం కావాలి అని పోస్టు పెట్టాడు. ఇది కూడా పోలీసులకు ఆధారంగా దొరికింది.

అయితే అక్టోబరు, 2023లో రహస్య పోలీసు అధికారి.. ప్లంబ్‌ చెడు ప్రణాళికలను గుర్తించి పోలీసులను అప్రమత్తం చేసి అరెస్ట్ చేయించాడు. ఇదిలా ఉంటే ప్లంబ్ ఇప్పటికే రెండు సార్లు దోషిగా తేలాడు. 2006లో నకిలీ తుపాకీ, బెదిరింపు నోటుతో ఇద్దరు మహిళలను రైలు నుంచి బలవంతంగా కిందపడేసేందుకు ప్రయత్నించాడు. అలాగే వూల్‌వర్త్స్ స్టాక్ రూమ్‌లో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను కట్టివేయడానికి ప్రయత్నించాడు. ఇలా రెండు కేసుల్లో దోషిగా తేలాడు. ఇదిలా ఉంటే యాంకర్ కేసులో.. అన్ని ఆరోపణలను ప్లంబ్ ఖండించడం విశేషం. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇక టీవీ యాంకర్ విల్లోబీ గతేడాది అక్బోబర్‌లో పదవీవిరమణకు ముందు 14 ఏళ్ల పాటు ‘దిస్ మార్నింగ్’ హోస్ట్‌గా పని చేసింది. టెలివిజన్‌లోకి రాకముందు మోడల్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2007, ఆగస్టులో హంగ్రీ బేర్ మీడియా సహ వ్యవస్థాపకుడు డాన్ బాల్డ్విన్‌ను వివాహం చేసుకుంది. లండన్‌లో నివసిస్తున్న ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.