NTV Telugu Site icon

Jammu Kashmir: భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న భారత సైన్యం

Jammu

Jammu

Jammu Kashmir: జమ్మూలోని అఖ్నూర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంత భారీ ఆయుధాలు, మెటీరియల్ లభ్యతను చూస్తే ఈ ఉగ్రవాదులు కచ్చితంగా దీర్ఘకాలిక యుద్ధం చేయాలనే ఉద్దేశంతో పెద్ద కుట్రకు పాల్పడ్డారని స్పష్టమవుతోంది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో M4 కార్బైన్, AK-47 రైఫిల్, ఇతర సామగ్రి వంటి అధునాతన ఆయుధాలు ఉన్నాయి. అక్టోబర్ 28న అఖ్నూర్‌లో జోగ్వాన్ ప్రాంతంలో ఆర్మీ అంబులెన్స్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో వాహనంపై చాలా బుల్లెట్ గుర్తులు కనిపించాయి. ఈ దాడి అనంతరం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆర్మీ జవాన్లు, పోలీసులతో కలిసి గ్రామం, పరిసర ప్రాంతాలను చుట్టుముట్టి ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: Explosion Sounds In Kerala: ఒక్కసారిగా పేలుడు శబ్దాలు.. ఉలిక్కిపడ్డ గ్రామం

మరోవైపు అఖ్నూర్ సెక్టార్‌లోని క్యారీ బాటల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మొదట భద్రతా బలగాలు మరో విజయం సాధించాయని, సైన్యం ఒక ఉగ్రవాదిని హతమార్చిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు భారీ దాడికి సన్నద్ధమయ్యారని 10వ పదాతిదళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సమీర్ శ్రీవాస్తవ తెలిపారు. మేము దీని కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నామని.. ఎందుకంటే, మేము నిరంతరం సమాచారాన్ని పొందుతున్నాము. వారిని ఓ ప్రాంతంలో చుట్టుముట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. భద్రతా కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతో ఉగ్రవాదులు ఇంటీరియర్‌ల నుంచి ఈ ప్రాంతానికి వచ్చారని, అయితే సత్వర చర్యతో కుట్ర విఫలమైందని మేజర్ జనరల్ శ్రీవాస్తవ చెప్పారు.

ఈ ఆపరేషన్‌లో స్పెషల్ ఫోర్సెస్, NSG కమాండోల చర్య ఇంకా BMP-2 పదాతిదళ పోరాట వాహనాలు ఉపయోగించబడ్డాయి. ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతంలో 30 డిగ్రీల వాలు, దట్టమైన అడవులు ఉన్నాయని అధికారి తెలిపారు. భారత సైన్యం వృత్తిపరమైన శక్తి అని, హతమైన ఉగ్రవాది మృత దేహానికి ఎటువంటి అగౌరవం లేదని కూడా మేము నొక్కి చెప్పాలనుకుంటున్నాము. ఉగ్రవాదులకు ఈ ప్రాంతం గురించి బాగా తెలుసని, వేరే ప్రాంతం నుంచి వచ్చారని కూడా ఆర్మీ అధికారి తెలిపారు.