Lashkar Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు ఉత్సవాలు రెండోరోజు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నేడు ప్రధాన ఘట్టమైన బోనాల వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు రంగం కార్యక్రమం మొదలవుతుంది. మాతంగి స్వర్ణలత పచ్చి కుండ పై నిలబడి భవిష్యవాణి వినిపించనున్నారు. క్షేత్రంలో అమ్మ చెప్పిన మాటలు నిజమవుతాయని భక్తుల విశ్వాసం. జాతకం అనంతరం అమ్మవారి, అంబారీ ఊరేగింపు వైభవంగా సాగనుంది. అంబారీ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అంబారీ పై ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత పోతరాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాల కార్యక్రమం ఉంటుంది. ఇక సాయంత్రం పోట్టేళ్లతో పలహారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. బోనాల్లో ముఖ్య ఘట్టమైన భవిష్య వాణిలో మాతంగి స్వర్ణలత రానున్న ఎన్నికల గురించి ఏం చెప్తుందో అందరిలో ఆసక్తి నెలకొంది. ఆదివారం అమ్మవారికి నాయకులు అందరూ వచ్చి వారి వారి కోరికలు తీర్చుకున్నారు.
Read also: NCP Political Crisis: అజిత్ చేయి వదిలిన మరో ఎమ్మెల్యే.. శరద్ పవార్ గూటికి చేరిక
జోగిని బంగారు భవిష్యవాణి వినిపించింది. పూజా విధానంపై ఆమె భవిష్యవాణిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రూపురేఖలు నీ ఇష్టం వచ్చినట్లు మారుస్తావా? నేను ఎన్ని రూపాల్లో రూపాంతరం చెందుతాను? మీ ఇష్టానికి మార్చాలా? నేను స్థిరమైన రూపంలో కొలవాలనుకుంటున్నాను. నా ఫామ్ స్థిరంగా ఉంచు. భక్తులు నన్ను కళ్లారా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయండి. గర్భగుడిలో పూజలు చేయకండి.. శాస్త్రోక్తంగా పూజించండి. నా గుడిలో పూజలు సక్రమంగా జరగడం లేదు. ఏదైనా నైవేద్యం పెడితే పూజలు చేస్తున్నారు. నీ గుండెల మీద చేయి వేసుకుని నువ్వు ఎంత సంతోషంగా పూజ చేస్తున్నావో చెప్పు. నువ్వు చేస్తున్న పూజ నీ సంతోషం కోసమే తప్ప నా కోసం కాదు. మీరు చేయాల్సింది చాలా లేదు. అన్నీ నాకు లభించినవే. వాళ్లు నన్ను దొంగల్లా వ్యవహరిస్తున్నారు. నీ తప్పులకు నా కోపాన్ని వానల రూపంలో చూపించాను అని స్వర్ణలత భవిష్యవాణి అన్నారు.
Bengal Re-Polling: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రీ – పోలింగ్.. 697 కేంద్రాల్లో నేడు నిర్వహణ