NTV Telugu Site icon

Scotland vs Australia: ట్రావిస్ హెడ్ ఊచకోత.. ఆస్ట్రేలియా ఘన విజయం..

Scotland Vs Australia

Scotland Vs Australia

Scotland vs Australia: స్కాట్లాండ్ పర్యటనకు వెళ్ళిన ఆస్ట్రేలియా క్రికెట్ మంచి శుభారంభాన్ని అందుకుంది. మూడు టి20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా స్కాట్లాండ్ టూర్కు వెళ్ళింది. ఈ సిరీస్ భాగంగా బుధవారం నాడు జరిగిన మొదటి టి20లో స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా 7 వికెట్ల భారీ విజయాన్ని అందుకుంది. 155 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలో పూర్తి చేసింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 154 పరుగులను చేసింది. ఇక స్కాట్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే.. కీపర్ మాథ్యూ క్రాస్ మ్యాచ్ 21 బంతులలో మూడు ఫోర్ల సహాయంతో 27 పరుగులు, ఓపెనర్ జార్జ్ 16 బంతులలో 2 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 28 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా టీం బౌలింగ్ లో మూడు వికెట్లు.., బార్ట్ లెట్, జంపా చెరో రెండు వికెట్లు., కెమెరాన్ గ్రీన్, మెరెడిత్ లు చిరో ఒక వికెట్ తీసుకున్నారు.

The Greatest Of All Time: విజయ్‌ ‘ది గోట్‌’లో మాజీ క్రికెటర్‌ మాత్రమే కాదు.. స్టార్ హీరో కూడా!

ఇక 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా మొదటి ఓవర్ లోనే ఓపనర్ మెక్గుర్క్ ఎటువంటి పరుగులు తీయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. ఇక మరో ఓపనర్ ట్రావిస్ హెడ్ 25 బంతుల్లోనే 80 పరుగులు సాధించాడు. 5 సిక్సర్లు, 12 ఫోర్ ల సహాయంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వన్ డౌన్ గా వచ్చిన కెప్టెన్ మిచెల్ మార్స్ కూడా 12 బంతులలో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లు సహాయంతో 39 పరుగులను చేశాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 9.4 ఓవర్లలోనే టార్గెట్ ను చేరుకుంది. 62 బంతులు మిగిలి ఉండగానే.. ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. ఇక స్కాట్లాండ్ లో మార్క్ వాట్ 2 వికెట్లు., బ్రాండన్ ముక్కముల్లెన్ ఒక వికెట్ తీసుకున్నారు. ట్రావిస్ హెడ్ (Travis Head) కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Show comments