NTV Telugu Site icon

Scooty Viral Video : విద్యుత్ స్తంభం ఎక్కిన స్కూటర్

New Project

New Project

Scooty Viral Video : ప్రతి ఒక్కరూ తమ వాహనాన్ని సురక్షితమైన పార్కింగ్‌లో మాత్రమే పార్క్ చేయాలనుకుంటున్నారు. కానీ కొన్ని సార్లు ప్రకృతి వైపరీత్యాల ముందు మీరెంత భద్రత పాటించినా అది పనిచేయదు. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఒక స్కూటీ విద్యుత్ తీగలకు వేలాడుతూ కనిపిస్తుంది. ఇది చూసి జనాలు నవ్వుతున్నారు. స్కూటీని అలాంటి చోట కూడా సురక్షితంగా పెట్టొచ్చని ఇప్పుడే తెలిసిందంటున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుమారు 22 సెకన్ల వీడియో క్లిప్ @swatic12 అనే ట్విట్టర్ ఖాతా నుండి పోస్ట్ చేయబడింది. పోస్టింగ్ చేసిన యూజర్ ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియోలో విద్యుత్ సరఫరా వైర్‌లకు స్కూటీ వేలాడుతూ కనిపించింది. సెలూన్ భవనం గోడకు ఆనుకుని ఉన్న స్కూటీ చుట్టూ దట్టమైన వైర్లు ఉన్నాయి. జూన్ 20న పోస్ట్ చేసిన ఈ వీడియో బాగా పాపులర్ అయింది. కేవలం రెండు రోజుల్లోనే 1.67 లక్షల మంది వీక్షించగా, 1,600కు పైగా లైక్‌లు కూడా వచ్చాయి. ఇది చాలా సార్లు రీట్వీట్ చేయబడింది. దీనిపై ప్రజలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు.

Read Also:Malaika Arora : హాట్ పోజులతో పిచ్చెక్కిస్తున్న ముదురు భామ..

స్కూటీ వైర్లకు వేలాడదీయడం వెనుక గల కారణాన్ని ఓ మీడియా వివరించింది. ఆదివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌ను తాకిన భారీ తుఫాను దీనికి కారణమైంది. ఈ స్కూటీ జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతం నుండి 15 అడుగుల ఎత్తులో విద్యుత్ తీగలలో చిక్కుకుంది. అనంతరం క్రేన్‌ను పిలిపించి స్కూటీని కిందకు దించారు. ఇంతలో గుమికూడిన జనం వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

Read Also:Mahi V Raghav: డిస్నీ+ హాట్‌స్టార్ పరువు తీశారంటే.. ‘పంది’తో గొడవ పడలేనంటున్న డైరెక్టర్!