Tallest Tree: బ్రెజిలియన్, బ్రిటిష్ పరిశోధకుల బృందం 2019లో 3డీ మ్యాపింగ్ అధ్యయనంలో భాగంగా ఉపగ్రహ చిత్రాల్లో ఒక అత్యంత ఎత్తైన చెట్టును కనుగొన్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆ చెట్టు గురించి ఏదో తెలియని కుతూహలం కలిగింది. ఎలాగైనా ఆ చెట్టు గురించి తెలుసుకోవాలని.. అక్కడకు భౌతికంగా చేరుకుని ఆ చెట్టును చూడాలని పరిశోధతులు అనుకున్నారు. ఈ మేరకు ఆ చెట్టు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో ఆ చెట్టు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆ చెట్టు దట్టమైన అడవిలో ఉన్నందున ఆ భారీ వృక్షాన్ని చేరుకోవడానికి వారికి మూడేళ్ల ప్రణాళిక, ఐదు యాత్రలు, దాదాపు రెండు వారాల పాటు ట్రెక్కింగ్ చేసి అక్కడికి చేరుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఆ అమెజాన్ దిగ్గజాన్ని చేరుకోగలిగారు.
PM Narendra Modi: దేశంలో తొలి సోలార్ విలేజ్‌ను ప్రకటించిన ప్రధాని మోడీ
శాస్త్రవేత్తల ప్రకారం, 9.9 మీటర్లు (32 అడుగులు) చుట్టుకొలత, 88.5 మీటర్లు (290 అడుగులు) పొడవు కలిగిన ఈ చెట్టు అమెజాన్‌లో కనుగొనబడిన అతిపెద్ద చెట్టు. ఏంజెలిమ్-వెర్మెల్హో అని కూడా పిలువబడే డినిజియా ఎక్సెల్సా చెట్టు 30-అంతస్తుల ఆకాశహర్మ్యం పరిమాణంలో ఉంటుంది. ఇది 400 ఏళ్ల నాటి పురాతనమైన చెట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి చెట్లను పర్యవేక్షించడం, దానిలో దాగున్న ప్రత్యేక లక్షణాలు, జరిగే పర్యావరణ ప్రక్రియలపై అధ్యయనం చేయనున్నట్లు శాస్తవేత్తల బృందం వెల్లడించింది. పరిశోధకులు వాటిని పర్యవేక్షించడంతో పాటు పెద్ద చెట్ల ప్రత్యేక లక్షణాలలో జరిగే ప్రాథమిక పర్యావరణ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు