ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. చెత్తలో పేలుడుతో సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆగిరిపల్లి మండలం వడ్లమాను సమీపంలోని తాడేపల్లి శివారు హ్యాపీ వ్యాలీ స్కూల్ ప్రహరీ గోడ పక్కన ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నూజివీడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుర్గాప్రసాద్ చికిత్స పొందుతూ మృతి చెందగా శాంతల మణికి స్వల్ప గాయాలు అయ్యాయి. చెత్త దగ్గర భయంకర శబ్దంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాగా పేరుకుపోయిన చెత్తను తగులబెట్టేందుకు ప్రయత్నించారు. చెత్తకు నిప్పంటించగా కెమికల్ తో కూడిన వ్యర్థపదార్థాలు ఉన్నట్లు గుర్తించారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also:Small Loans-Better Payments: తిరిగివ్వటంలో.. తనదైన ‘‘ముద్ర’’
విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో ఫైర్
ఇదిలా ఉండగా… విజయవాడలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యాధరపురం డిపోలో ఆర్టీసి బస్సులు ఫైర్ అయ్యాయి. ఈ ఘటనలో ఒక బస్ పూర్తిగా కాలిపోయింది. మరొక బస్ పాక్షికంగా దగ్దం అయింది. డిపోలో సర్విసింగ్ కు ఆగి ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సీఎన్జీలో లీకేజ్ సమస్య కారణంగా మంటలు అంటుకున్నట్టు భావిస్తున్నారు అధికారులు.. ఆర్టీసీ బస్సుల మెయింటెన్స్ విషయంలో అధికారుల డొల్లతనం బయటపడుతుందని విమర్శలు వస్తున్నాయి.ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
