అవినీతి అక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తోన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని నియమించింది. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలు కొత్త కమిటీ చూసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.
Also Read: Sachin Tendulkar: సూర్యకుమార్‌లా అమ్మాయి బ్యాటింగ్..సచిన్, జైషా ప్రశంసలు
త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు సూచించింది. హెచ్‌సీఏలో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించడంపై ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావుకు హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతల అప్పజెప్పాలని ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాది దవే సుప్రీంకు పేర్కొన్నారు. దవే సూచనలను అంగీకరించిన సుప్రీంకోర్టు హెచ్‌సీఏ కమిటీ రద్దుకే మొగ్గుచూపింది. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావుకు అన్ని విధాలా సహకరించాలని హెచ్‌సీఏకు సుప్రీం ఆదేశించింది.
Also Read: Mumbai Police : నిందితుడిని జైల్లో పెట్టుకుని.. 20ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు
అజారుద్దీన్ వల్లే ఈ పరిస్థితి..
ఇదే విషయమై HCA తాజా సెక్రటరీ విజయానంద్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. తమ టర్మ్ గత సెప్టెంబర్‌లోనే ముగిసిందని.. అయినా ఇన్ని రోజులు కొనసాగామని గుర్తుచేశారు. “మన టర్మ్ అయిపోయింది. దిగిపోదాం అని అజహర్‌కు చెప్పాం. కానీ అజహర్ మా మాట వినకుండా కొనసాగారు. అజారుద్దీన్ తీరు వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆయనకు క్రికెట్ ఆటలో నైపుణ్యం ఉంది.. కానీ అడ్మినిస్ట్రేషన్‌లో ఫెయిల్ అయ్యాడు. హెచ్‌సీఏలో ఉన్న క్లబ్ మెంబర్స్ నన్ను క్షమించండి. హెచ్‌సీఏ ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తారు అనుకుంటున్నాను” అని విజయానంద్ చెప్పారు.