NTV Telugu Site icon

SBI SO 2024: స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను కోరుతున్న ఎస్‭బిఐ..

Sbi So 2024

Sbi So 2024

SBI SO 2024 Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ తోపాటు అనేక ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 19 జూలై నుండి 8 ఆగస్టు 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చేయాలి. ఇక ఈ నోటిఫికేషన్ లో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలని సూచించారు.

Kalki 2898 AD 25 Days: ఓరి దేవుడా.. అప్పుడే 25 రోజులయ్యిందా..?

1 పోస్ట్ – సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్),
2 పోస్టులు – సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్),
1 పోస్ట్ – ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (టెక్నాలజీ),
2 పోస్టులు – ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (బిజినెస్),
150 పోస్టులు – రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులు (రెగ్యులర్ పోస్ట్),
123 పోస్టులు – రిలేషన్ షిప్ మేనేజర్ (బ్యాక్ లాగ్ పోస్ట్),
600 పోస్టులు – VP హెల్త్ (రెగ్యులర్ పోస్ట్),
43 పోస్టులు – VP హెల్త్ (బ్యాక్ లాగ్ పోస్ట్),
21 పోస్టులు – రిలేషన్ షిప్ మేనేజర్ టీమ్ లీడ్ (రెగ్యులర్ పోస్ట్),
11 పోస్టులు – రిలేషన్ షిప్ మేనేజర్ టీమ్ లీడ్ (బ్యాక్ లాగ్ పోస్ట్),
2 పోస్టులు – రీజనల్ హెడ్ (రెగ్యులర్ పోస్టులు),
4 పోస్టులు – రీజనల్ హెడ్ (బ్యాక్ లాగ్ పోస్ట్),
30 పోస్టులు – ఇన్వెస్ట్ మెంట్ స్పెషలిస్ట్ (రెగ్యులర్ పోస్ట్),
23 పోస్టులు – ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ (రెగ్యులర్ పోస్ట్),
26 పోస్టులు – ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (బ్యాక్‌లాగ్ పోస్ట్) పోస్టులపై రిక్రూట్‌మెంట్ ఉంటుంది.

Mr Bachchan vs Double iSmart: బాక్సాఫీస్ క్లాష్.. మాస్ vs మాస్ మహారాజా.. ఏమవుద్దో?

ఇక పోస్ట్ వారీగా విద్యార్హత, వయో పరిమితి గురించి చుస్తే..

1.సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్): 5 సంవత్సరాల అనుభవంతో MBA/PGDM/PGDBM డిగ్రీ. వయస్సు 30 – 45 సంవత్సరాలు ఉండాలి.

2.సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (మద్దతు): 3 సంవత్సరాల అనుభవంతో కామర్స్/ఫైనాన్స్/ఎకనామిక్స్/మేనేజ్‌మెంట్/గణితం/స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ. వయస్సు 25 – 35 ఏళ్లు ఉండాలి.

3. ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (టెక్నాలజీ): 4 సంవత్సరాల అనుభవంతో పాటు MBA/MMS/PGDM/ME/M.Tech./BE/B.Tech./PGDBM డిగ్రీ కలిగి ఉండాలి. వయస్సు 25 – 40 సంవత్సరాలు ఉండాలి.

4. ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (బిజినెస్): 5 సంవత్సరాల అనుభవంతో పాటు MBA/PGDM/PGDBM డిగ్రీని కలిగి ఉండాలి. వయస్సు 30 – 40 సంవత్సరాలు ఉండాలి.

5. రిలేషన్షిప్ మేనేజర్ (రెగ్యులర్ పోస్ట్), రిలేషన్షిప్ మేనేజర్ (బ్యాక్లాగ్ పోస్ట్): 3 సంవత్సరాల అనుభవంతో బ్యాచిలర్ డిగ్రీ. వయస్సు 25 – 35 సంవత్సరాలు ఉండాలి.

Brinda: ఇంట్రెస్టింగ్ కంటెంట్‭తో రాబోతున్న త్రిష “బృంద”..

6. VP హెల్త్ (రెగ్యులర్ పోస్ట్), VP హెల్త్ (బ్యాక్‌లాగ్ పోస్ట్): 6 సంవత్సరాల అనుభవంతో బ్యాచిలర్ డిగ్రీ. వయస్సు 26 – 42 సంవత్సరాలు ఉండాలి.

7. రిలేషన్‌షిప్ మేనేజర్ టీమ్ లీడ్ (రెగ్యులర్ పోస్ట్), రిలేషన్ షిప్ మేనేజర్ టీమ్ లీడ్ (బ్యాక్‌లాగ్ పోస్ట్): 8 సంవత్సరాల అనుభవంతో బ్యాచిలర్ డిగ్రీ. వయస్సు 28 – 42 ఏళ్లు మించకూడదు.

8. రీజినల్ హెడ్ (రెగ్యులర్ పోస్ట్), రీజినల్ హెడ్ (బ్యాక్‌లాగ్ పోస్ట్): 12 సంవత్సరాల అనుభవంతో బ్యాచిలర్ డిగ్రీ. వయస్సు 35 – 50 సంవత్సరాలు ఉండాలి.

9. ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్ (రెగ్యులర్ పోస్ట్): 6 సంవత్సరాల అనుభవంతో పాటు MBA/PGDM/PGDBM లేదా CA/CFA డిగ్రీని కలిగి ఉండాలి. వయస్సు 28 – 42 సంవత్సరాలు ఉండాలి.

10. ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (రెగ్యులర్ పోస్ట్), ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (బ్యాక్‌లాగ్ పోస్ట్): 4 సంవత్సరాల అనుభవంతో పాటు MBA/PGDM/PGDBM లేదా CA/CFA డిగ్రీని కలిగి ఉండాలి. వయస్సు 28 – 40 సంవత్సరాలు ఉండాలి. అన్ని పోస్ట్‌ల గురించి సవివరమైన సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.