స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్) రిక్రూట్‌మెంట్ 2025 పరీక్ష తేదీలను ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష 2025 సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో జరుగనుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 6,589 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. కేటగిరీల వారీగా పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డ్ సమాచారాన్ని చెక్ చేసుకోవచ్చు.
Also Read:JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
ప్రిలిమ్స్ కోసం అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు అవుతారు. లాంగ్వేజ్ ఎఫిషియెన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. టైర్ 2 మెయిన్స్ పరీక్ష నవంబర్ 2025 లో జరుగుతుంది. ఈ పోస్టులకు ఎంపికైతే రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీతం లభిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 26న ముగిసింది.
