NTV Telugu Site icon

MLA Sayanna: నిజాం వారసులకు దక్కిన గౌరవం సాయన్నకు దక్కలేదు : బీజేపీ

G Sayanna

G Sayanna

MLA Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న అంత్యక్రియలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపక పోవటాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుభాష తీవ్రంగా ఖండించారు. 1994వ సంవత్సరం నుండి మూడు దశాబ్దాల పాటు ఐదు సార్లు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి తుది శ్వాస వరకు ప్రజాసేవకు తపించిన ఆజాతశత్రువు సాయన్న. అయితే మంత్రి తలసాని ద్వారా ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏర్పాట్లు.. ఉద్దేశ్యపూర్వకంగా మర్చిపోయిన వైఖరి శోచనీయం. తెలంగాణ సీఎం కేసీఆర్.. సాయన్న అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించకపోవటం చరిత్రలో వివక్షకు సాక్ష్యంగా మిగిలిపోతుంది.

Read Also: Marriage : పెళ్లికి ముందే విరిగిన మంచం… ముఖం చాటేసిన వరుడు

ఎంతో మంది సినీ నటులు.. మరెంతో మంది రాజకీయ నేతల అంత్యక్రియలు సీఎం కేసీఆర్ అధికారికంగా నిర్వహించారు.. మొన్న నటుడు కృష్ణ అంత్యక్రియలు కూడా అధికారికంగా నిర్వహించిన సందర్భాన్ని బీజేపీ స్వాగతిస్తుందని కానీ.. మూడు దశాబ్దాలుగా ప్రజాసేవలో నిమగ్నమై, కంటోన్మెంట్ ప్రజల మన్ననలు పొందిన దళిత నేత సాయన్న అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించకుండా తాను పొందిన రాక్షస ఆనందం దొరతనానికి తార్కాణమన్నారు.

Read Also:Love Today: సూపర్ హిట్ సినిమా రీమేక్ కి రంగం సిద్ధం…

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ముకరంజా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్ లో చనిపోతే ప్రత్యేక విమానంలో వారి మృతదేహాన్ని తెచ్చి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన రీతిలో సాయన్న అంత్యక్రియలు జరుపకపోవటం వెనక ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు. పవిత్ర భారత రాజ్యాంగం పై ఏ మాత్రం గౌరవం లేని కేసీఆర్ ఒకవేళ తాను రాసుకున్న రాజ్యాంగంలో దళితులను, దళిత నాయకత్వాన్ని, దళిత ప్రజాప్రతినిధులను వివక్షతో అణిచివేయాలనే నిబంధనలు ఏమైనా ఉంటే తెలంగాణ సమాజానికి తెలియపరచేయాలని డిమాండ్ చేశారు. ఏదేమైనా ప్రత్యేక రాష్ట్ర చరిత్రలో దళితుల ఆత్మగౌరవాన్ని సవాల్ చేస్తున్న కేసీఆర్ వైఖరికి ఘాటుగానే సమాధానం ఎదురవుతుందని.. ‘మాజీ CM’ గా బిరుదు ఇచ్చి లాంఛనంగా సత్కరిస్తామన్నారు.

Show comments