NTV Telugu Site icon

Satyabhama Trailer: నటసింహం బాలయ్య చేతుల మీదుగా “సత్యభామ” ట్రైలర్ రిలీజ్..

Sathyabhama

Sathyabhama

కాజల్ అగర్వాల్ తాజాగా లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. సినిమాలో నవీన్ చంద్ర ‘అమరేందర్’ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడైన శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు. చిత్రాన్ని ‘క్రైమ్ థ్రిల్లర్’ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.“సత్యభామ” సినిమాను జూన్ 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది.

Balakrishna: ఎన్టి రామారావు వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు.. బాలయ్య హాట్ కామెంట్స్..

ఇక ఈ రోజు నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడిటర్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఒక మల్టీఫోల్డెడ్ క్రైమ్ థ్రిల్లర్ అని., ఈ సినిమాకు ఎడిటింగ్ తో పాటు కాజల్ అగర్వాల్ కు అసిస్టెంట్ రోల్ లో నటించానని తెలిపాడు. ఇక డైరెక్టర్ సుమన్ చిక్కాల కావాలనే తన కలను ఈ మూవీతో తీర్చుకుంటున్నారని., ఈ టీమ్ నాకొక ఫ్యామిలీ లాంటిది అంటూ.. మా ఫ్యామిలీ మెంబర్స్ కు “సత్యభామ” బిగ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Medha Patkar: మేధా పాట్కర్‌కు షాక్.. పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారణ

ఇక ఈ సినిమాకు ఈవెంట్ సందర్బంగా.. లిరిసిస్ట్ రాంబాబు గోసాల, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, డైరెక్టర్ సుమన్ చిక్కాల, నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి, హీరో నవీన్ చంద్ర, చిత్ర సమర్పకులు, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క, అతిగా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ కాజల్ అగర్వాల్, ముఖ్య అతిధి గా వచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణలు సినిమా గురించి పలు వ్యాఖ్యలు చేసారు.

Show comments