Site icon NTV Telugu

Sai Pallavi: నా పేరు పెట్టింది ఆయనే.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు..

Saipallavi

Saipallavi

Sai Pallavi: శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని భక్తులు అలంకరించారు. ఈ వేడుకలకు హిల్ వ్యూ స్టేడియం ముస్తాబైంది. దీంతో పాటు పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, స్టేడియంలో స్వర్ణ రథంపై సత్యసాయి చిత్ర పటాన్ని ఊరేగింపును సత్యాసాయి ట్రస్ట్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో గతంలో న్యాచురల్ బ్యూటీ, హీరోయిన్ సాయి పల్లవికి చెందిన ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. తన పేరుకు సంబంధించి సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

READ MORE: Sholay Bike: IFFI గోవాలో.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన.. ‘షోలే’లో ఉపయోగించిన 83 ఏళ్ల బైక్

హీరోయిన్ సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మా అమ్మ తాతయ్య సాయి బాబాకు భక్తులు.. మా అమ్మ, అత్తమ్మలు, మావయ్యలు సాయి బాబాకు చెందిన యూనివర్సిటీలోనే చదివారు. నన్ను చిన్నప్పటి నుంచే అక్కడికి తీసుకెళ్లే వారు. పుట్టపర్తి సాయిబాబా స్వామి నాకు పేరు పెట్టారు. నన్ను దీవించి పేరు పెట్టారు. 14, 15 ఏళ్ల తరువాత నాపేరు నాకు చాలా నచ్చింది. చాలా డిఫిరెంట్‌గా ఉందనిపించింది. నేను కూడా సాయిబాబా భక్తురాలినే.. సత్యసాయి బోధనలే నాలో ధైర్యాన్ని నింపాయి.. ఎలాంటి సమయంలోనైనా ప్రశాంతంగా ఉండటం, ఒత్తిడిని అధిగమించడం, క్రమశిక్షణ, ధాన్యం వంటివి ఆయన ద్వారానే నేర్చుకున్నాను” అని పేర్కొంది.

Exit mobile version