న్యాచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే మూవీలో నటిస్తున్నాడు.టైటిల్ విభిన్నంగా ఉండడంతో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ మూవీపై మొదటి నుంచే బజ్ క్రియేట్ అయింది.. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.నాని,వివేక్ కాంబినేషన్‍లో రెండో చిత్రంగా సరిపోదా శనివారం మూవీ తెరకెక్కుతుంది..గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు నాని, వివేక్ అత్రేయ కాంబోలో వస్తున్న ‘సరిపోదా శనివారం’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ అంచనాలకు తగ్గట్టుగానే ‘సరిపోదా శనివారం’ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. ఏకంగా రూ.45కోట్లను వెచ్చించి ‘సరిపోదా శనివారం’ మూవీ అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. నాని కెరీర్లో ఇదే అత్యధిక ఓటీటీ డీల్‍గా ఉన్నట్లు తెలుస్తుంది.సరిపోదా శనివారం మూవీ పాన్ ఇండియా రేంజ్‍లో తెరకెక్కుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.అలాగే ఈ మూవీలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.తమిళ ప్రముఖ యాక్టర్ ఎస్‍జే సూర్య ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‍లో సూర్య పాల్గొన్నారు.