హాట్ యాంకర్ అయిన అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. జబర్దస్త్ వంటి కామెడీ షో ద్వారా ఎంతో పాపులారిటీ ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు పొందింది.బుల్లితెరపై వెండి తెరపై రెండిటిలో కూడా తిరుగులేని ఆర్టిస్ట్ గా మారింది.వయసు పెరిగేకొద్దీ అనసూయ కి మరింత గా డిమాండ్ పెరుగుతుంది. కుర్ర యాంకర్లకు మరింతగా పోటీ ఇస్తూ… సోషల్ మీడియాలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఆమె సంపాదించుకుంది..
క్రేజ్ పాపులారిటీ తో పాటు అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేస్తూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారింది.. ఇక ఇదే సమయంలో ఒక పక్క సినీ ప్రపంచంలో విహారిస్తూనే మరోపక్క కుటుంబ జీవితానికి కూడా ఆమె ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు వెకేషన్ లకు కూడా వెళ్తుంది.ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ఓ షోరూం ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందని సమాచారం..ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి ముందు ప్రీ ఫోటో షూట్ లో ఆమె పాల్గొనడం జరిగింది. ఈ ఫోటోషూట్ లో అనసూయ అదిరిపోయే లుక్స్ తో అదరగొట్టింది.. అనసూయ ఇప్పుడు వరుస సినిమా ఆఫర్స్ ను అందుకుంటుంది. లేటెస్ట్ గా విమానం సినిమాలో అదిరిపోయే హాట్ క్యారెక్టర్ ఒకటి చేసింది. ఈ పాత్రలో కూడా అనసూయ అందరిని ఆకట్టుకునేలా వుంది. అలాగే పుష్ప 2 సినిమాలో కూడా ద్రాక్షాయిని పాత్రను చేస్తుంది.ఈ సినిమాలో ఆమె పాత్ర కొంత ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.ఈ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెడుతుంది అని ఆమె భావిస్తుంది. విభిన్న పాత్రలకు అనసూయ కేరాఫ్ గా మారింది.