Site icon NTV Telugu

Sardar 2 : సర్దార్ 2 వచ్చేస్తోంది.. ఈ ఏడాదే కార్తీ యాక్షన్ ధమాకా!

Sardhar 2. Karthi

Sardhar 2. Karthi

తమిళ స్టార్ హీరో కార్తీ కెరీర్‌లో సూపర్ హిట్ అయిన స్పై థ్రిల్లర్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ సిద్ధమవుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. 2026లోనే ఈ భారీ యాక్షన్ రైడ్ థియేటర్లలోకి రాబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి, ఎందుకంటే మొదటి భాగంలో కార్తీ చేసిన స్పై రోల్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంది. ఈ సీక్వెల్ మొదటి భాగానికి మించి మరింత గ్రాండ్‌గా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉండబోతోందని తెలుస్తోంది.

Also Read : 2026 Box Office: సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద స్క్రీన్ల యుద్ధం.. ఎగ్జిబిటర్లకు తలనొప్పిగా మారిన ఐదు సినిమాలు!

ఈ సినిమాలో కార్తీ సరసన మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. యోగి బాబు తన కామెడీతో అలరించబోతున్నారు. స్పై థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ ఏడాది థియేటర్లలో తుపాను సృష్టించడానికి సిద్ధమవుతున్న ఈ ‘సర్దార్ 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. కార్తీ అభిమానులు మాత్రం తమ ఫేవరెట్ హీరోని మరోసారి డిఫరెంట్ గెటప్స్‌లో చూడటానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 

Exit mobile version