బాలీవుడ్ యంగ్ స్టార్ సారా అలీ ఖాన్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఆదాయ వనరులను పెంచుకోవడంలోనూ తన తండ్రి బాటలోనే నడుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న తన ఖరీదైన బంగ్లాను ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు లీజుకు ఇచ్చి భారీ డీల్ కుదుర్చుకున్నారు. ‘ప్రాడిజీ మాంటిస్సోరి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ ఈ ప్రాంగణాన్ని పాఠశాల అవసరాల కోసం అద్దెకు తీసుకుంది. కాగా ప్రాపర్టీ డేటా సంస్థ ‘సీఆర్ఈ మాట్రిక్స్’ (CRE Matrix) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ లీజు ఒప్పందం మే 1, 2026 నుంచి అమలులోకి రానుంది.
కాగా నెలకు రూ. 6.5 లక్షలతో ఈ రెంట్ ప్రారంభమవుతుంది. అంటే చదరపు అడుగుకు రూ. 144.44 చొప్పున వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఐదేళ్ల కాలానికి గాను సారా అలీ ఖాన్‌కు సుమారు రూ. 4.14 కోట్ల ఆదాయం రానుంది. అద్దెదారు ఇప్పటికే రూ. 20 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించారు. అంతేకాదు ఐదేళ్ల లీజులో మూడేళ్ల పాటు ‘లాక్-ఇన్ పీరియడ్’ ఉంటుంది, మూడవ ఏడాది నుంచి ప్రతి ఏటా అద్దె 5 శాతం మేర పెరుగుతుంది. ఇక సారా అలీ ఖాన్ మాత్రమే కాదు, బాలీవుడ్‌లోని ఇతర స్టార్స్ కూడా తమ ఆస్తులను లీజుకు ఇస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
Also Read : Nagarjuna: ‘కింగ్ 100’ స్టోరీ పై హింట్ ఇచ్చిన నాగార్జున..!
మాధురి దీక్షిత్.. లోయర్ పరేల్‌లోని ఆఫీస్ స్పేస్‌ను ఐదేళ్లకు రూ. 2.81 కోట్లకు లీజుకు ఇచ్చారు. శ్రద్ధా కపూర్.. జుహూలోని అపార్ట్‌మెంట్ కోసం ఏడాదికి రూ. 72 లక్షల రెంట్ చెల్లిస్తున్నారు. రాకేష్ రోషన్.. అంధేరీలోని కమర్షియల్ స్పేస్‌ను నెలకు రూ. 14.5 లక్షల అద్దెకు ‘ఫ్యాబ్ ఇండియా’కు ఇచ్చారు. తమ సంపాదనను ఇలా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టి, దాని ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్న సెలబ్రిటీల తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
