NTV Telugu Site icon

Sankranthiki Vasthunnam: నేటి నుండి ఓటీటీలో సందడి చేయనున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’

Sankranthiki Vasthunnam

Sankranthiki Vasthunnam

Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ రోజు (మార్చి 1) సాయంత్రం 6 గంటలకు జీ5, జీ తెలుగు చానల్‌లో ఈ సినిమా ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్‌ అందుబాటులో ఉండనుంది.

Read Also: High Court: ఇకపై ప్రీమియర్, స్పెషల్, బెనిఫిట్ షోలకు ‘నో పర్మిషన్’

ఈ సందర్బంగా జీ5 ప్రతినిధి మాట్లాడుతూ.. “ఈ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని ఓటీటీ, టీవీ ద్వారా ప్రేక్షకులకు అందించగోతున్నందుకు ఆనందంగా ఉంది. కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిది” అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకున్న చిత్రమని తెలిపారు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి అద్భుతమైన నటన ఈ కథను మరింత ఎలివేట్ చేసిందన్నారు. ఇక ఈ విషయంపై హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. “రాజు పాత్రలో నటించడం గొప్ప అనుభూతి. ఈ కథ ఆద్యంతం నవ్వులే నవ్వులు పంచుతుంది” అని పేర్కొన్నారు. అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మి పాత్ర నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ప్రేక్షకులు దీన్ని ఎంతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మేళవించిన ఈ సినిమా నేటి నుంచి జీ5, జీ తెలుగులో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమాను ఓటీటీలో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.