NTV Telugu Site icon

Kodi Pandelu: ఏపీలో జోరుగా కోడి పందాలు..

Cock Fight

Cock Fight

ఆంధ్రుల పెద్ద పండుగ సంక్రాంతికి జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో ఏటా సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు అని చెప్పొచ్చు. కోడి పందేలను వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా వస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో కోడి పందేల నిర్వాహకులు తమ పుంజులను బరిలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. కోడి పుంజుల ఎంపిక, వాటికి ప్రత్యేక శిక్షణ, మంచి పౌష్టికాహారం, శారీరక పటుత్వానికి ప్రత్యేక వ్యాయామాలు చేయించి బరిలోకి దించుతున్నారు.

Read Also: IPL 2024 Final: ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి.. విజేతగా సన్‌రైజర్స్ హైదరాబాద్!

మరోవైపు, కోడి పందాలను చూసేందుకు వచ్చే అతిథుల కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్ లైట్లు, హైటెక్ హంగులతో కోడి పందాలు ఏర్పాటు చేశారు. పందెం బరిలో కాలు దువ్వెందుకు కోడి పుంజులు కాలు దువుతున్నాయి. ఏడాది పొడవునా లక్షల రూపాయల ఖర్చు చేసి పుంజులను వస్తాదుల్లా పందెం రాయుళ్లు తయారు చేశారు. ఈ మూడు రోజుల పాటు భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. వివిధ రంగుల్లో కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులను పందేలకు రెడీ చేశారు. మరోవైపు, పోలీసులు కోడి పందాలపై కఠిన ఆంక్షలు విధించారు. కోడి పందాలు, గుండాటలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఇప్పటికే గత రెండు రోజులుగా ఎక్కడైతే కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే అక్కడకు తమ సిబ్బంది వెళ్లి ఏర్పాట్లను ధ్వంసం చేయడం, ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.