Site icon NTV Telugu

Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌కు సంజు శాంసన్‌ గుడ్ బై.. ఏ జట్టుకు మారుతున్నాడో తెలుసా!

Sanju Samson

Sanju Samson

Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌ టీంకు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో సంజు శాంసన్‌ గుడ్ బై చెప్పే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. సంజు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారడం దాదాపు ఖాయం అని సమాచారం. రాజస్థాన్ సంజును ఢిల్లీకి ఇవ్వాలని పరిశీలిస్తున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంపై రెండు ఫ్రాంచైజీలు పరస్పర ఒప్పందానికి కూడా వచ్చినట్లు సమాచారం. సంజును కొనుగోలు చేయడానికి ఢిల్లీ కూడా చాలా ఆసక్తిగా ఉందని, కానీ దాని ప్రధాన ఆటగాళ్లను రాజస్థాన్‌కు ఇవ్వడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. ప్రతిగా ఢిల్లీ తన రూ.10 కోట్ల విలువైన ఆటగాడు ట్రిస్టాన్ స్టబ్స్‌ను రాజస్థాన్‌కు ఇవ్వడానికి అంగీకరించిందని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

READ ALSO: Ladakh Earthquake: లడఖ్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం

ఢిల్లీకి సంజు శాంసన్..
సంజు శాంసన్ గతంలో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ఆడాడు. అతను 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున సంజు శాంసన్ బరిలోకి దిగాడు. అప్పట్లో ఆ ఫ్రాంచైజీని ఢిల్లీ డేర్ డెవిల్స్ అని పిలిచేవారు. ఐపీఎల్ 2016లో సంజు 14 మ్యాచ్‌ల్లో 291 పరుగులు సాధించగా, ఐపీఎల్ 2017లో 14 మ్యాచ్‌ల్లో 386 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. 2018 మెగా వేలంలో సంజు శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సంజు ఆర్‌ఆర్‌లో భాగంగా ఉన్నాడు. తాజాగా సంజును ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇచ్చి ఆ జట్టు నుంచి కెఎల్ రాహుల్‌ను తన జట్టులోకి తీసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ పట్టుదలతో ఉందని నివేదికలు వచ్చాయి. అయితే డీసీ దీనికి అస్సలు అంగీకరించలేదని సమాచారం. జట్టు బ్రాండ్ విలువను పెంచడంలో కెఎల్ రాహుల్ కీలక పాత్ర పోషిస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్ విశ్వసిస్తోంది. గత సీజన్‌లో కూడా రాహుల్ అసాధారణంగా రాణించాడు. సంజుకు బదులుగా స్టబ్స్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ ఉత్సాహంగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దక్షిణాఫ్రికా ఆటగాడితో పాటు మరో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను కూడా వాళ్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిని ఢిల్లీ జట్టు పరిగణనలోకి తీసుకోలేదు.

READ ALSO: women’s World Cup 2025: BCCI ఓపెన్ ఆఫర్.. ప్రపంచ కప్ గెలిస్తే రూ.125 కోట్లు గిఫ్ట్ !

Exit mobile version