Site icon NTV Telugu

Rohit Sharma: రోజురోజుకూ రోహిత్‌ ఆట పడిపోతోంది.. ఏదో నెట్టుకొస్తున్నాడు అంతే!

Rohit Sharma

Rohit Sharma

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌లో ఏదోలా నెట్టుకొస్తున్నాడని, హిట్‌మ్యాన్‌లో ఒకప్పటి ఫామ్‌ లేదని భారత మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నారు. 3-4 ఏళ్ల క్రితం నాటి రోహిత్‌ అయితే కాదని, రోజు రోజుకూ అతడి ఆట పడిపోతోందన్నారు. పరిస్థితులకు తగ్గట్లు మారకుండా.. ఇప్పటికీ తన సహజసిద్ధమైన బ్యాటింగ్‌ నైపుణ్యంపైనే ఆధారపడుతున్నాడని విమర్శించారు. రోహిత్ ఇప్పటికైనా కఠోర సాధన చేసి అత్యుత్తమంగా రాణించడంపై దృష్టి సారించాలని మంజ్రేకర్‌ సూచించారు.

జియోస్టార్‌లో సంజయ్‌ మంజ్రేకర్‌ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం రోహిత్‌ శర్మ కెరీర్‌లో చరమాంకంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్‌లో ఒకప్పటి ఫామ్‌ లేదని కచ్చితంగా చెప్పొచ్చు. మూడు నాలుగేళ్ల క్రితం నాటి రోహిత్‌ అయితే కాదు. రోహిత్ ఆట రోజురోజుకూ పడిపోతోంది. అతడు బరిలో దిగిన ప్రతిసారీ సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. పిచ్, పరిస్థితులకు తగ్గట్లు మారకుండా.. ఇప్పటికీ తన సహజ బ్యాటింగ్‌ నైపుణ్యంపైనే ఆధారపడుతున్నాడు. రోహిత్ ఇప్పటికైనా కఠోర సాధన చేసి అత్యుత్తమంగా రాణించడంపై దృష్టి సారించాలి. అప్పుడే కెరీర్ ఘనంగా ముగించొచ్చు’ అని చెప్పారు. ఇటీవలి కాలంలో హిట్‌మ్యాన్‌ అడపాదడపా ఇన్నింగ్స్ తప్పితే.. పెద్దగా రాణించిన దాఖలు లేవు. ఐపీఎల్ 2025లోనూ విఫలమవుతున్నాడు.

Exit mobile version