Sanitation Workers Strike in Guntur: ఉమ్మడి గుంటూరు జిల్లాలో చెత్త పేరుకుపోయింది. గడిచిన ఐదు రోజులుగా పారిశుధ్య కార్మికులు సార్వత్రిక సమ్మెకు దిగడంతో.. ఇళ్లల్లో చెత్త పేరుకుపోయింది. ఇండిపెండెంట్ హౌస్‌లు, అపార్ట్మెంట్స్ అన్న తేడా లేకుండా ఇళ్లలో చెత్త నిండిపోయింది. ఓ పక్క చలికాలం, మరోపక్క దోమల బెడద ఎక్కువ అవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త విపరీతంగా పేరుకుపోవడంతో దుర్గంధంతో పాటు రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
Also Read: ISRO: పీఎస్‌ఎల్‌వీ-సీ58 కౌంట్‌డౌన్ షురూ!
గడిచిన ఐదు రోజులుగా చెత్త తొలగించపోవడంతో గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న డస్ట్ బిన్‌లు నిండిపోయాయి. దుర్గందాన్ని భరించలేక చెత్తను స్థానికులు తగలబెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు సిబ్బందితో మున్సిపల్ అధికారులు చెత్త తొలగిస్తున్నారు. మరోవైపు పారిశుధ్య కార్మికుల సమ్మెతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని ఇళ్లులు మురికి కృపాలుగా మారాయి. మున్సిపల్ కార్మికులు సమ్మెతో ఊరువాడా అంతా చెత్తాచెదారాలు పెరిగిపోయి కంపు కొడుతున్నాయి. రోడ్లపైన, డ్రైనేజీల్లోనూ చెత్త పేరుకుపోయాయి. డ్రైనేజీల్లో చెత్తాచెదారాలు అడ్డుపడిపోయి.. మురికి నీరు ప్రవహిస్తోంది. దాంతో దుర్వాసనతో పాటు దోమలు బెడద అధికంగా ఉందని జనాలు వాపోతున్నారు. తాము అనారోగ్యాలతో బాధపడుతున్నామని గగ్గోలు పెడుతున్నారు.