NTV Telugu Site icon

Sania Mirza: సానియా మీర్జా విడాకులు.. పోస్ట్ వైరల్ ?

Sania

Sania

Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తరువాత ఆమెచాలా ఇబ్బందులను ఎదుర్కొంది. వాటిని అన్నింటిని ఎదుర్కొని సానియా.. భర్తతో పాకిస్తాన్ లోనే కాపురం పెట్టింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకు ఉన్నాడు. కొన్నాళ్ళు కలతలు లేకుండా ఉన్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయని టాక్. రెండేళ్ల క్రితం మొట్టమొదటిసారి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ జంట విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక గతేడాది ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు సానియా పోస్ట్ లు ఉండడంతో ఆల్రెడీ సానియా విడాకులు తీసుకుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలోనే వీరిద్దరూ కలిసి పాకిస్తాన్ టీవీ ఛానెల్ లో ఒక షోను హోస్ట్ చేశారు. ఒకవేళ దానికి ప్రమోషన్స్ కోసం.. ఇలాంటి పోస్టులు పెట్టి ఉంటుందేమో అని భావించారు.

ఇకపోతే మరోసారి సానియా విడాకుల గురించి హింట్ ఇచ్చి షాక్ ఇచ్చింది. తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పెళ్లి, విడాకులకు సంబందించిన కొటేషన్ ను షేర్ చేసింది. “వివాహం కఠినం.. విడాకులు తీసుకోవడం కఠినం.. నీకు నచ్చిన కఠినాన్ని ఎంచుకో.. ఊబకాయం కష్టం.. ఫిట్‌గా ఉండటం కష్టం.. నీకు నచ్చిన కఠినాన్ని ఎంచుకో. అప్పులు చేయడం కష్టం. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టం. నీకు నచ్చిన కఠినాన్ని ఎంచుకో. కమ్యూనికేషన్ కష్టం. కమ్యూనికేట్ చేయకపోవడం కష్టం. నీకు నచ్చిన కఠినాన్ని ఎంచుకో. జీవితం ఎప్పుడూ సులభం కాదు. ఇది ఎల్లప్పుడూ కఠినంగా ఉంటుంది. కానీ మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి” అని రాసుకొచ్చింది. దీంతో సానియా మరోసారి విడాకుల వార్తలకు హిట్ ఇచ్చినట్లు అయ్యింది. మరి సానియా ఏది ఎంచుకుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments