NTV Telugu Site icon

Sania Mirza: ఆర్సీబీ మెంటర్‌గా సానియా..అందమంతా ఆ టీమ్‌లోనే!

2

2

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన నిర్ణయంతో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఓ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న ఆర్సీబీ.. జట్టు మెంటర్‌గా క్రికెటేతర ప్లేయర్‌ను నియమించింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. తమ మహిళా జట్టుకు మార్గదర్శనం చేసేందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి మరొకరు దొరకరంటూ సానియాకు స్వాగతం పలికింది.

“మా కోచింగ్‌ సిబ్బంది క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంది. అయితే, కఠిన పరిస్థితులు, ఒత్తిడిని అధిగమించేందుకు మా మహిళా క్రికెటర్లకు సరైన మార్గదర్శి ఉండాలని భావించాం. ఛాంపియన్‌ అథ్లెట్‌, అవరోధాలు అధిగమించి దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగిన వ్యక్తిని మా మెంటర్‌గా నియమించాం. మా కుటుంబంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం సానియా మీర్జా” అని పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే విమెన్స్ ఐపీఎల్‌లో తనను భాగం చేసినందుకు సానియా మీర్జా సంతోషం వ్యక్తం చేసింది. ఆర్సీబీ హోస్ట్‌తో మాట్లాడిన సానియా.. ఈ ఆఫర్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంది. అయితే ఈ బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని స్పష్టం చేసింది. 20 ఏళ్లుగా తాను ప్రొఫెషనల్ ప్లేయర్‌గా రాణించానని, ఇప్పుడు యువ మహిళా ప్లేయర్లకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ఆర్సీబీ మెంటార్‌గా ప్లేయర్లకు అండగా ఉంటూ.. వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చింది.

అందమంతా ఆర్సీబీలోనే..

టీమ్ మెంటర్‌గా సానియా మీర్జా నియామకంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆర్సీబీ.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీని కూడా తీసుకుంది. మహిళా క్రికెటర్లలోనే అత్యంత బ్యూటిఫుల్ ప్లేయర్లు అయిన స్మృతి, పెర్రీలు ఆర్సీబీలోనే ఉండటం.. తాజాగా టెన్నిస్ బ్యూటీ సానియా జట్టుతో చేరడంతో ఫ్యా్న్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందాలన్నీ ఆర్సీబీతోనే ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read: Chetan Sharma: ‘కెప్టెన్సీపై కోహ్లీ అబద్ధం చెప్పాడు..గంగూలీపై అనవసర నిందలు’