NTV Telugu Site icon

Sania-Shami: సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి ఫొటోలు వైరల్!

Sania Mirza And Mohammad Shami Marriage

Sania Mirza And Mohammad Shami Marriage

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన సతీమణి హసీన్‌ జహాన్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. షమీపై లైంగిక ఆరోపణలు, గృహహింస చట్టం కింద హసీన్‌ కేసులు వేశారు. ప్రస్తుతం షమీ ఒంటరిగా ఉంటున్నాడు. మరోవైపు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు గతేడాది విడాకుల ఇచ్చారు. ప్రస్తుతం ఆమె తన కొడుకుతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు. అయితే ఇప్పటికే సానియా, షమీపై పలు వార్తలు రాగా.. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి చేసుకున్నట్లు నెట్టింటి జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోస్ అన్ని ఫేక్. కొందరు ఆకతాయిలు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సానియా, షమీ పెళ్లి చేశారు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఫేక్ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. సానియా, షమీ పెళ్లి చేసుకోలేదు.. వారి కెరీర్‌తో బిజీగా ఉన్నారు. మరి ఈ ఫోటోలపై ఇద్దరు స్టార్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

గతంలో సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లిపై వార్తలు వచ్చాయి. ఈ పుకార్లపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఘాటుగా స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాము అసలు షమీని కలవలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు తన జీవితంలో విన్న అతి పెద్ద రూమర్ ఇదే అని షమీ కొట్టిపారేశాడు. ఇక గాయాల అనంతరం దాదాపు ఏడాది తర్వాత దేశవాళీ క్రికెట్‌తో పునరాగమనం చేసి.. రంజీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో షమీ సత్తాచాటాడు. అయినా అతడిని బీసీసీఐ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదు. సానియా మీర్జా దుబాయ్‌లో ఉంటున్నారు.

Show comments