Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన క్రేజీ ఫాంటసీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాకాస’. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ చిత్రం, మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు. మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ హారర్ ఎలిమెంట్స్‌కు స్వచ్ఛమైన కామెడీని జోడించి ఆమె మలిచిన విధానం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.
తాజా సమాచారం ప్రకారం, ‘రాకాస’ చిత్రం మే 1, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. వేసవి సెలవుల్లో ఇంటి దగ్గరే కూర్చుని ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీనుల కామెడీ ఈ సినిమాకు అసలైన బలం. వీరి ముగ్గురి టైమింగ్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. తన నేచురల్ యాక్టింగ్‌తో సంగీత్ మరోసారి యూత్‌ను ఆకట్టుకున్నారు. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి ఈ ఫన్ రైడ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారు మే 1 కోసం ఎదురుచూస్తున్నారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారితో పాటు కామెడీ ప్రియులకు కూడా ‘రాకాస’ ఒక మంచి ఎంటర్టైనర్ కానుంది.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!