Sangareddy: కడుపునొప్పితో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చేతికి ఇన్ ఫెక్షన్ తో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణం అంటున్నాడు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన బాధితుడి దయనీయ గాథ ఇది.. సంగమేశ్వర(33) అనే యువకుడు ఈ ఏడాది జూలై 23న రాత్రి 8 గంటలకు కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. ఇంజెక్షన్స్, సెలైన్లు పెట్టడంతో తన చేయి ఎర్రగా వాచింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ ని అడిగితే ఐస్ పెట్టుకోమంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక చేయి మరింత వాచింది. సంగారెడ్డిలో ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లగా చేతికి ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెప్పారు.
READ MORE: Shah Rukh : ‘దిల్ సే’ నుంచి ‘ఓం శాంతి ఓం’ వరకు.. షారుఖ్ బర్త్‌డే రీ-రిలీజ్ వేడుకలు
తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్ కిమ్స్ కి సంగమేశ్వర్ ని తీసుకెళ్లారు. చేతికి ఇన్ ఫెక్షన్ సోకిందని చేయి తొలగించాలని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళనకి గురయ్యారు. అక్కడి నుంచి యశోదా ఆస్పత్రికి తరలించారు. చేతికి ఇన్ ఫెక్షన్ తొలగించడానికి రూ. 35 లక్షలు ఖర్చు చేశారు. చికిత్స కోసం ఉన్న ఇల్లును అమ్మారని బాధితుడు బోరున విలపిస్తున్నాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేశాడు. చేతికి ఇన్ ఫెక్షన్ అయితే నువ్వు బతకవు కదా.. అంటూ సూపరింటెండెంట్ మురళికృష్ణ సమాధానం ఇచ్చారని చెబుతున్నాడు.
READ MORE: JR NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్
