NTV Telugu Site icon

Sangareddy DSP: నీ అమ్మ చెప్పు తీసుకుని కొడుతా.. సంగారెడ్డి డీఎస్పీ బూతు పురాణం!

Mrf Employees

Mrf Employees

సంగారెడ్డి డీఎస్పీ ఏ.సత్తయ్య గౌడ్ బూతు పురాణం బయటపడింది. సదశివపేట ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులపై డీఎస్పీ సత్తయ్య నోరు జారారు. ‘నీ అమ్మ చెప్పు తీసుకుని కొడుతా చెత్తనా కొడకా’ అంటూ కార్మికులను డీఎస్పీ బూతులు తిట్టారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డీఎస్పీ తీరుపట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని కార్మికులు డిమాండ్ చేశారు.

తమని పర్మినెంట్ చేయాలంటూ సదశివపేట ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీ బయట 300 మంది కార్మికులు ధర్నా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ పోలీసులతో కంపెనీ వద్దకు చేరుకున్నారు. ధర్నా విరమించాలని కార్మికులను డీఎస్పీ హెచ్చరించారు. కార్మికులు మాట వినకపోవడంతో ‘నీ అమ్మ చెప్పు తీసుకుని కొడుతా చెత్తనా కొడకా’ అంటూ బూతులు తిట్టారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డీఎస్పీ తీరుపట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.