NTV Telugu Site icon

Sandeep Reddy Vanga : చిరంజీవి గారితో అలాంటి సినిమా చేయాలని వుంది..

Whatsapp Image 2023 12 09 At 8.42.13 Pm

Whatsapp Image 2023 12 09 At 8.42.13 Pm

ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు బాగా వినిపిస్తుంది.ఈ దర్శకుడు మొదట తెలుగులో విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి మూవీ తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఆ తర్వాత బాలీవుడ్‍లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‍ తో సందీప్ సంచలనం సృష్టించారు. సందీప్ తెరకెక్కించిన ఈ చిత్రాలు ఎంత సక్సెస్ అయ్యాయో అంత విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.యానిమల్ విడుదల అయిన మొదటి రోజు నుండి ఇప్పటివరకు ఏకంగా రూ.600కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.యానిమల్ మూవీపై కూడా విమర్శలు బలంగానే వస్తున్నాయి. అయితే యానిమల్ సినిమా ప్రమోషన్లలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ మూవీ ప్రచారం కోసం ఆయన ప్రస్తుతం అమెరికాకు వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవితో అవకాశం వస్తే ఓ మూవీ చేయాలని ఉందని అన్నారు. చిరూతో యాక్షన్ డ్రామా సినిమా చేసేందుకు ఇష్టపడతానని సందీప్ తెలిపారు. తనకు చిరంజీవి ఎంతో ఇష్టమని గతంలో కూడా సందీప్ వెల్లడించారు. ఇప్పుడు ఆయనతో సినిమా తీయాలనుందంటూ వెల్లడించారు.యానిమల్ సినిమా.. మహిళలపై ద్వేషం, హింసను ప్రేరేపించేలా ఉందని కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై కూడా సందీప్ పరోక్షంగా స్పందించారు. సినిమాను సినిమాలాగే చూడాలని అన్నారు.”ఇక్కడికి వచ్చిన వారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే.. మహిళలపై ద్వేషం గురించి ఎవరూ ప్రశ్నలు వేయలేదు. మీరు సరైన ప్రేక్షకులు. మీరు యానిమల్‍ను ఓ సినిమాలానే చూశారు. నాకు చాలా సంతోషంగా ఉంది” అని సందీప్ వంగా చెప్పారు.యానిమల్ సినిమాలో హింస ఎక్కువగా ఉందని, మహిళలను కించపరిచే విధంగా చూపించారంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సమాజంపై ఈ చిత్రం చెడు ప్రభావాన్ని చూపుతుందని విమర్శిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చిన యానిమల్ మూవీ కలెక్షన్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి చాలా థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి.యానిమల్ మూవీ రణ్‍బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‍గా నిలిచింది.యానిమల్ మూవీ లో రణ్ బీర్ అద్భుతంగా నటించారు. అలాగే సినిమాలో రష్మిక మందన్నా, బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి ముఖ్య పాత్రలు పోషించారు.

Show comments