Underworld Don: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తికి వేలంలో ఊహించని రేటు వచ్చింది. కనీస ధర 15 వేల రూపాయలుగా నిర్ణయించగా.. ఏకంగా 2 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. దావూద్ ఇబ్రహీంకు వారసత్వంగా వచ్చిన నాలుగు ఆస్తులో రెండు పొలాలు, ఇంటిని ఓ లాయర్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ముంబాకే గ్రామంలో దావూద్ ఇబ్రహీం పూర్వీకులు నివాసం ఉండేవారు. ఆ గ్రామంలో ఓ ప్లాట్ తో పాటు ఆయనకు నాలుగు రకాల ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. ముంబైలో వివిధ నేరాలకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
Read Also: Devara Audio Rights: భారీ ధరకు ఎన్టీఆర్ ‘దేవర’ ఆడియో హక్కులు!
అయితే, పలు క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో దావూద్ ఇబ్రహీంకు చెందిన వివిధ ఆస్తులను ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. ముంబాకేలోని నాలుగు ఆస్తులను 2020లో వేలం వేసింది. ఇందులో పాల్గొన్న లాయర్ అజయ్ శ్రీవాస్తవ.. రూ.2.01 కోట్లు వెచ్చించి వాటిని దక్కించుకున్నాడు. దావూద్ ఇబ్రహీంకు చెందిన ప్లాట్ ను సొంతం చేసుకున్న అతడు మీడియాతో మాట్లాడుతూ.. ఆ ప్లాట్ ను పునరుద్ధరించి సనాతన ధర్మ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దక్షిణ ముంబైలోని ఆయ్కార్ భవన్‌లో వేలం ప్రక్రియ జరిగింది. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.